Monday, October 28, 2024
Monday, October 28, 2024

ఆర్థిక, సైనిక సహకారం పెంచుకుందాం

. కిమ్‌, పుతిన్‌ సంకల్పం
. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు
. 24ఏళ్ల తర్వాత ఉ.కొరియాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు

ప్యాంగ్యాంగ్‌/మాస్కో: ఆర్థిక, సైనికపరమైన సహకారాన్ని మరింత పెంచుకోవాలని రష్యా, ఉత్తర కొరియా అధినేతలు వ్లాదిమిర్‌ పుతిన్‌, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సంకల్పించారు. తమ దౌత్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. పాశ్యాత్య ఒత్తిళ్లను కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఇదే క్రమంలో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కదుర్చుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా గడ్డపై కాలుమోపారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఆయుధ సరఫరా వివాదాస్పదమైన వేళ పుతిన్‌ ఉత్తర కొరియా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిరది. ఉత్తర కొరియాలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. రోడ్డుకు రెండు వైపులా భారీ సంఖ్యలో జనం చేరుకొని పూలు, ఉత్తర కొరియా, రష్యా జెండాలు ప్రదర్శిస్తూ, ఎరుపు, నీలం, శ్వేత టీషర్లు ధరించి పుతిన్‌కు స్వాగతం పలికారు. రాజధాని నగరంలోని కిమ్‌ 2 సంగ్‌ స్వ్కేర్‌లో పుతిన్‌కు కిమ్‌ అట్టహాసంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. అనేక అంశాలపై చర్చించారు. ఆర్థిక, సైనికపరమైన సహకారాన్ని మరింత పెంచుకోవాలని, పశ్చిమ దేశాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ప్యాంగ్యాంగ్‌ సదస్సు సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. తొలుత కిమ్‌ 2 సంగ్‌ స్క్వేర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై యుద్ధానికి అందించిన మద్దతుకుగాను కిమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య విధానాలపై పోరాటంలో భాగంగానే ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగిస్తున్నట్లు వెల్లడిరచారు. దీర్ఘకాల సంబంధాలకు పునాదిగా నూతన పత్రంపై తాము సంతకాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కొరియా యుద్ధం సమయంలో ప్యాంగ్యాంగ్‌కు మాస్కో మద్దతు, రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు కొరియా ద్వీపంలో జపాన్‌ సైన్యంతో సోవియట్‌ సైన్యం పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. సోవియట్‌ కాలంలో కంటే తమ స్నేహబంధం ప్రస్తుతం పటిష్ఠంగా ఉందని చెప్పారు. ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక చర్యలకు ఉత్తర కొరియా సాయాన్ని, సంఫీుభావాన్ని స్వాగతించారు. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కూడా పుతిన్‌తో ఏకీభవించారు. అమెరికా ఆధిపత్య విధానాలను తీవ్రంగా ఖండిరచారు.
రష్యా ప్రయోజనాల దృష్ట్యా తీసుకునే చర్యలకు ఉత్తర కొరియా మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని హామీనిచ్చారు. రెండు దేశాల భాగస్వామ్యం కోసం ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఒప్పందం గురించి ఎలాంటి వివరాలు వెల్లడిరచలేదు. ఉత్తర కొరియాపై ఐరాస భద్రత మండలి… రష్యాపై అమెరికా, దాని మిత్ర దేశాల ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే.
కిమ్‌కు విలాసవంత కారు బహూకరించిన పుతిన్‌
రష్యా అధ్యక్షుడి తొలి పర్యటన సందర్భంగా ఇద్దరు అధినేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. రష్యాలో తయారైన విలాసవంతమైన ఉరుస్‌ కారుతో పాటు టీ సెట్‌ను కిమ్‌కు బహూకరించినట్లు క్రెమ్లిన్‌ అధికారి యూరి ఉషాకోవ్‌ తెలిపారు. పుతిన్‌కు కూడా ఆయన స్థాయికి తగ్గట్లు బహుమతులు అందినట్లు చెప్పారు. అయితే అవి ఏమిటో మాత్రం వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img