Monday, October 28, 2024
Monday, October 28, 2024

ఆ విదేశీ విద్యార్థులకు గ్రీన్‌ కార్డు ఇవ్వాలి: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలోని కాలేజీలలో పట్టభద్రులయ్యే విదేశీ విద్యార్థులకు గ్రీన్‌ కార్డు ఇవ్వాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక ప్రతిపాదన చేశారు. అయితే స్టూడెంట్‌ వీసాలున్న విద్యార్థులకేనా లేక వీసా గడువు ముగిసినా దేశాన్ని వీడనివారు… అక్రమంగా అమెరికాకు వచ్చిన వారికీ ఇది వర్తిస్తుందా అన్నది ఆయన స్పష్టంచేలేదు. సిలికాన్‌ వ్యాలీ టెక్‌ ఇన్వెస్టర్లు, ఏంజిల్‌ ఇన్వెస్టర్‌ జాస్‌ కలాకనిస్‌ నిర్వహించిన ఆలిన్‌ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్‌ ఈ ప్రతిపాదన చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి ఉత్తమ ప్రతిభావంతులను అమెరికాకు తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని హామీ ఇవ్వగలరా అని కలాకనిస్‌ అడిగితే… తప్పకుండా అని ట్రంప్‌ బదులిచ్చారు. నా ఆలోచన కూడా అదే కాబట్టి హామీనిస్తున్నా అని చెప్పారు. కాలేజి నుంచి గ్రాడ్యుయేట్‌ కాగానే డిప్లోమాలో భాగంగానే గ్రీన్‌ కార్డు ఇవ్వాలని, ఇది జూనియర్‌ కాలేజీలకూ వర్తింపజేయాలని ట్రంప్‌ సూచించారు.
రష్యా సరిహద్దుకు నాటో విస్తరణ కవ్వింపే…
రష్యా సరిహద్దుకు నాటోను విస్తరించడమనేది కవ్వింపు చర్యే అవుతుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. తమ సరిహద్దుల్లో నాటో బృందాలు కనిపిస్తే రష్యా ఊరుకోదని చెప్పారు. తూర్పు దిశగా నాటో విస్తరణే ప్రస్తుత ఘర్షణకు ప్రధాన కారణమన్నారు. నాటోలో ఉక్రెయిన్‌ చేరుతుందని అధ్యక్షుడు బైడెన్‌ చెప్పడం కూడా ఒక విధంగా రష్యాను రెచ్చగొట్టడమే అని ట్రంప్‌ అన్నారు ‘బైడెన్‌ చాలా తప్పులు మాట్లాడతారు. ఉక్రెయిన్‌ నాటోలో చేరుతుందనడం కూడా అలాంటిదే… చెప్పాల్సిన దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడినట్లు ఆయన వ్యాఖ్యలుంటాయి. ఇలా చాలా సందర్భాల్లో జరిగినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోవడం లేదు’ అని ట్రంప్‌ విమర్శించారు. తాను తిరిగి అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌ గడ్డపైకి అమెరికా దళాలను పంపబోదని సంకల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img