Monday, October 28, 2024
Monday, October 28, 2024

ఉ.కొరియా`రష్యా రక్షణ ఒప్పందంతో ముప్పు

ద.కొరియా ఆగ్రహం
రష్యా రాయబారికి సమన్లు

సియోల్‌: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో గోడను ఉత్తర కొరియా నిర్మించడం వివాదాస్పదమైంది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా తమ దేశంపై దండయాత్ర చేసేందుకు ప్రయత్నిస్తోందని ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తంచేస్తూనే ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర కొరియాలో పర్యటించడంతో దక్షిణ కొరియా కోపం తారస్థాయికి చేరుకుంది. ఉత్తర కొరియాతో రష్యా రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంపై మండిపడిరది. ఇది తమ భద్రతకు ముప్పు కలిగిస్తుందని వెల్లడిరచింది. దీంతో రష్యా రాబారికి సమన్లు జారీచేసింది. రష్యా దురాక్రమణను దీటుగా ఎదుర్కొనేందుకుగాను ఉక్రెయిన్‌కు ఆయుధ సహకారాన్ని అందించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇదే క్రమంలో రష్యా రాయబారికి సమన్లు జారీచేసింది. రష్యా రాయబారి జార్జ్‌ జినోవివ్‌ను దక్షిణ కొరియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కిమ్‌ హాంగ్‌ క్యున్‌ పిలిపించారు. ప్యాంగాంగ్‌తో సైనిక సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంపై సమాచారం ఇచ్చేందుకు విదేశాంగ శాఖ నిరాకరించింది. మరోవైపు ఉత్తర కొరియా బలగాలు సరిహద్దు దాటి వచ్చాయని, హెచ్చరిక కాల్పులు జరపడంతో వెనక్కి తగ్గాయని దక్షిణ కొరియా తెలిపింది. ఈనెలలో మూడవ సారి చొరబాటు యత్నం జరిగినట్లు ఆరోపించింది. సరిహద్దును దాటేందుకు ఉత్తర కొరియా సైనికులు యత్నించగా వారిని హెచ్చరిస్తూ కాల్పులు జరిపినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడిరచింది. ఇదిలావుంటే, ప్యాంగ్యాంగ్‌ వ్యతిరేకంగా 3,00,000 ప్రచార కరపత్రాలతో 20 బూరలను సరిహద్దు ఆవలికి దక్షిణ కొరియా కార్యకర్తలు పంపడాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ తీవ్రంగా పరిగణించారు. ఇలాంటివి కొనసాగిస్తూ ప్రతిఘటన తప్పబదోని దక్షిణ కొరియాను హెచ్చరించారు. గురువారం రాత్రి దక్షిణ కొరియా సరిహద్దు పట్టణమైన పంజు నుంచి 3వేల డాలర్లు, దక్షిణ కొరియా పాప్‌ పాటలు, టీవీ డ్రామాలతో 5వేల యూఎస్‌బీలనూ కార్యకర్తలు పంపారు. ‘చేయొద్దని వారించిన తర్వాత కూడా అదే పనిచేస్తే సహజంగానే ప్రతిఘటనను ఎదుర్కొవాల్సి వస్తుంది’ అంటూ కిమ్‌ యో జోంగ్‌ తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img