కమ్యూనిస్ట్ ఫ్రంట్ ప్రకటన
రోమ్: ఇటలీకి నిజమైన కమ్యూనిస్టు పార్టీ అవసరమని, శక్తిమంతమైన కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికిగాను ఈనెల 30న కొత్త కార్యాచరణను ప్రకటిస్తామని కమ్యూనిస్ట్ ఫోరం (ఫ్రాంటే కమ్యూనిస్టా) ఒక ప్రకటన చేసింది. ఫ్రంట్ ఆఫ్ కమ్యూనిస్ట్ యూత్ (ఫ్రంటే డెల్లా జియోవెంటు కమ్యూనిస్టాఎఫ్జీసీ)తో కలిసి మిలిటెంట్
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం దిశగా సాగనున్నట్లు తెలిపింది. ‘ఇటలీలో నిజమైన లెఫ్ట్ లోపించింది. పీడీ (పార్టిటో డెమొక్రటికో) గురించిగానీ దాని అనుబంధ సంఘాల గురించిగానీ మాట్లాడటం లేదు. లక్షల మంది కార్మికులు, యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అణగారిన వర్గాలకు అవసరమైనదే చెబుతున్నాం. ఆధునిక కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నాం. కాలానుగుణమైన ఉద్యమ కార్యాచరణ, యుద్ధాలు, సంక్షోభాలకు దీటైన నిజమైన రాజకీయ శక్తి కావాలని చెబుతున్నాం.‘గొప్ప కమ్యూనిస్టు పార్టీ లేకుండా పోటీగానీ విజయంగానీ సాధ్యం కాదు’ అని కమ్యూనిస్ట్ ఫ్రంట్ (ఎఫ్సీ), కమ్యూనిస్ట్ యూత్ ఫ్రంట్ (ఎఫ్జీసీ) ప్రకటన పిలుపునిచ్చింది.