Monday, October 28, 2024
Monday, October 28, 2024

స్వీడన్‌లో ఎర్ర బావుటా

స్టాక్‌హాల్మ్‌: స్వీడెన్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎస్‌కేపీ) ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన ఇవ్వగలిగిందని ఆ పార్టీ నేత ఆండ్రియాస్‌ సోరెన్‌సెన్‌ ఒక ప్రకటన చేశారు. 25ఏళ్ల తర్వాత ఇది సాధ్యమైనట్లు చెప్పారు. ‘దేశంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ రాణించింది. కొత్త ఓటర్లను ఆకర్షించింది. కమ్యూనిజం చచ్చిపోలేదని, తిరిగి పుంజుకునేలా అనువైన నేల దీనికి లభించిందని ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. సీడెన్‌ ఎన్నికల ప్రక్రియలో చిన్న పార్టీలకు ఆదరణ లభించలేదు. మా పార్టీ బ్యాలెట్లను దేశంలోని ప్రతి ఒక్క పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి చేరవేయాల్సి బాధ్యత మాపైనే ఉంటుంది. చిన్న పార్టీలు ఈ ప్రక్రియ కోసం చాలా వనరులను వెచ్చించాల్సి వస్తుంది. లేకపోతే నిజమైన రాజకీయ పనికి అవి వినియోగమవుతాయి. ఇదే క్రమంలో మా బ్యాలెటన్లు మాయం చేసేందుకు, తారుమారు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. అలా జరిగితే మళ్లీ కొత్త బ్యాలెట్లు మేమే తీసుకెళ్లాలి. మాకు ప్రతి ఓటు ఎంతో విలువైనది. స్వీడిష్‌ ఎన్నికల వ్యవస్థ అప్రజాస్వామికమైనది. బడా పార్టీల కోసం రూపొందినది.నీ వాస్తవాన్ని తోసిపుచ్చలేము. ఎన్ని కష్టాలు వచ్చినా, అవరోధాలు ఎదురైనా ఈ సారి ఎన్నికల్లో మేము చేయగలిగినదంతా చేశాం. చాలా కాలం తర్వాత ప్రతి ఒటరును చేరుకోగలిగాం. అందుకే 25 ఏళ్ల తర్వాత పార్టీ అద్భుత ప్రదర్శన ఇచ్చిందని చెప్పగలం’ అని ఆండ్రియాస్‌ సోరెన్‌సెన్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img