అమెరికాలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ (37) ను కాల్చి చంపారు. ఆయన ప్రయాణిస్తున్న కారులో దోపిడీకి యత్నించిన అగంతుకులు కాల్పులు జరపడంతో జానీ వాక్టర్ చనిపోయాడు. శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో (అమెరికా కాలమానం ప్రకారం) లాస్ ఏంజిల్స్ డౌన్టౌన్లో ఈ దుర్ఘటన జరిగినట్లు వాక్టర్ తల్లి స్కార్లెట్, పోలీసులు తెలిపారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాక్టర్ కారు వద్ద కాటలిక్ట్ కన్వర్టర్‌ను దొంగిలిస్తుండగా ఎదురుతిరిగిన అతనిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ వాక్టర్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్కార్లెట్ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోగా పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదని పోలీసులు తెలిపారు.