Monday, April 22, 2024
Monday, April 22, 2024

కూరగాయల మార్కెట్ వేలం 8.20 లక్షలు

విశాలాంధ్ర -ఆస్పరి : మండల పరిధిలోని బిణిగేరి గ్రామ సచివాలయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కూరగాయల మార్కెట్‌ వేలంపాటను చిన్నహోతూరు ఈరన్న 8 లక్షల 20 వేలు కు పాట పాడి దక్కించుకున్నాడు. సర్పంచ్ వెంకటేష్ అధ్యక్షతన మార్కెట్ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో పత్తికొండ ఇంచార్జి డిఎల్‌పిఒ ప్రకాష్‌ నాయుడు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ వేలం పాటలో 5 మంది పాటదారులు పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలంపాటలో చిన్నహోతూరు ఈరన్న 8లక్షల 20 వేలకు పాటను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఓ ఆర్ డి సూర్య నరసింహారెడ్డి, సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం గ్రామపంచాయతీ తీర్మానం మేరకు వేలంపాటలో వచ్చిన నగదును 50 శాతం దేవాలయాల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామని, మిగిలిన నగదును గ్రామపంచాయతీకి జమ చేస్తామన్నారు. గ్రామపంచాయతీ నిబంధనల మేరకే వేలంపాటను దక్కించుకున్న కాంట్రాక్టర్ నడుచుకోవాలని వారు సూచించారు. ఈ వేలంపాటలో కార్యదర్శి నబి రసూల్, చిగిలి-2 సచివాలయ కార్యదర్శి నాగమణి, ఎంపీటీసీ లక్ష్మీ డీలర్ సోమన్న, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, శ్వేతవాహన రెడ్డి, శేషాద్రి నాయుడు, వెంకటేశులు, భీమన్న, గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img