Monday, April 22, 2024
Monday, April 22, 2024

వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు ఐసీడీఎస్ సూపర్ వైజర్లు విజయ కుమారి, వీరగోవిందమ్మ ఆధ్వర్యంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలలో భాగంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను ఎంపీపీ శ్రీ విద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీడీఓ శ్రీనివాసరావు చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రం – 2కు సంబంధించిన గర్భిణులకు, బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల్లో పోషకాహార లోపంతో కలిగే రక్త హీనత, ఎదుగుదల లోపం, మాతాశిశు మరణాలు వంటి ఆనారోగ్య సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. నెలకు అవసరమయ్యే 10 రకాలైన వస్తువులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు సమదుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ మల్లయ్య, ఏపీఓ రామన్న, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img