విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పూజారులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ శివారులో వెలసిన శ్రీ పాతూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద గురువారం ఆలయ పెద్దల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛరణాలు మధ్య వైభవంగా జరిగింది. దాతలు పుష్పవతి, నాగరాజు దంపతుల సౌజన్యంతో శివలింగం, నందీశ్వరుడు, మహాగణపతి విగ్రహాలను అర్చకులు శేషగిరి జోషి మంత్రాలు పఠిస్తుండంగా ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బసవరాజు స్వామి, ఆలయ పెద్దలు కేజీ లింగన్న, జెల్లి హనుమన్న, బయప్ప, గోపాల్, మల్కాపురం ఈరన్న స్వామి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.