Friday, June 14, 2024
Friday, June 14, 2024

వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంను సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ప్రభుత్వం అందించే వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ కృష్ణ గౌడ్, వైసీపీ నాయకులు యోగేంద్ర, నాగేంద్ర గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మేకడోన గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను గర్భిణులు, బాలింతలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలలో రక్త హీనతను తగ్గించేందుకు, పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. సంపూర్ణ పోషణ కింద 11 రకాలైన వస్తువులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్ కుమార్, రాజు, అంగన్వాడీ వర్కర్లు ఈరమ్మ, సువార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img