విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండలంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో తాహశీల్దార్ సురేష్ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి పెద్దకడబూరు మండలానికి బదిలీపై వచ్చారన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అక్రమాలు, గొడవలు జరగకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోలీసు యంత్రాంగంతో ప్రశాంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. ఇందుకు సిపిఐ నాయకులు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. అనంతరం కొత్త గొల్లల దొడ్డి గ్రామంలోని రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఇలాంటి అధికారులు రాష్ట్రమంతా పని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, వెంకటరాముడు, లక్ష్మి, పార్వతి, తాయమ్మ తదితరులు పాల్గొన్నారు.