Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వర్షకాలంలో సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం మండల పరిధిలోని దొడ్డిమేకల, గంగులపాడు గ్రామాల్లో ఆయన పర్యటించి గ్రామాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షకాలం సందర్భంగా గ్రామాల్లో అతిసార, మలేరియా వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందన్నారు. కావున సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలలో పూడికతీత పనులను చేపట్టాలని ఆదేశించారు. అలాగే ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటినే సరఫరా చేయాలని సూచించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందజేస్తున్నారా లేదా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జనార్ధన్,ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి అయ్యపురెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img