Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

డైరెక్టర్‌ రాజు సాప్టే ఆత్మహత్యపై నేడు ఉన్నత స్థాయి భేటీ

అసెంబ్లీలో మహారాష్ట్ర హోంమంత్రి ప్రకటన
ముంబై : మఠారీ చిత్రాల ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజు సాప్టే ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వోన్నత అధికారులతో బుధవారం భేటీ అవుతున్నట్లు శాసనసభకు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ మంగళవారం తెలిపారు. చిత్రసీమలో ఎక్స్‌టార్షన్‌(దోపిడీ)ను ఉపేక్షించరాదని ముంబై పోలీసులకు సూచనలు జారీచేశానని, ఈ వ్యవహారంలో పూనే, పింప్రీ ఛించ్వాడ్‌ పోలీసు కమిషనర్లతోనూ మాట్లాడానని సభకు పాటిల్‌ తెలిపారు. ఏసీఎస్‌ (హోం), డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమై ఈ వ్యవహారంలో చర్చించనున్నట్లు వెల్లడిరచారు. ‘అంబట్‌ గౌడ్‌, మన్య` ది వండర్‌ బాయ్‌’ వంటి చిత్రాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సాప్టే ఈనెల 3న పింప్రీ ఛించ్వాడ్‌ టౌన్‌షిప్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కార్మిక సంఘానికి చెందిన ఓ వ్యక్తి నుంచి వేధింపులు ఉన్నట్లు తెలుపుతూ అతని వివరాలతో ఓ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ వీడియో, సూసైడ్‌ నోట్‌ లభించాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img