Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

పని ఎక్కువ.. వేతనం తక్కువ

దశాబ్దానికిపైగా ఇదే వృత్తిలో ఉన్నా ఉద్యోగ భద్రత లేదు
మహమ్మారి వేళ కోల్‌కతా శ్మశానాల వర్కర్ల ఆవేదన

కోల్‌కతా : కొవిడ్‌ మహమ్మారి దశలవారీ విజృం భణ నేపథ్యంలో మరణాలు పెద్ద సంఖ్యలో సంభవిస్తుం డటంతో కాటికాపరులపై పని ఒత్తిడి పెరిగింది. అధిక పనిగంటలు పనిచేసినా చాలీచాలని జీతాలతో సరిపెట్టు కోక తప్పని పరిస్థితి ఉంది. శ్మశానాల వర్కర్లు, హెల్త్‌కేర్‌ వర్కుర్లు కూడా కొవిడ్‌ కాలంలో చాలా కష్టపడు తున్నారుగానీ వారి శ్రమకు తగ్గ ఫలితం లేక తల్లడిల్లి పోతున్నారు. కనీసం ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా పరిగణ నించడం లేదు. దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నాగానీ పని భద్రత, పీపీఎఫ్‌ వంటి ప్రయోజనాలకు నోచు కోవడం లేదని కోల్‌కతా శ్మశానవాటికల వర్కర్లు అన్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి అంతిమ సంస్కారాలు జరుపుతుంటే ఒప్పంద కార్మికులుగానే ఉంచేశారని, పర్మనెంట్‌ చేయడం లేదని తెలిపారు. రోజుకు 90 నుంచి వంద మృతదేహాలు దహనానికి వస్తుండటంతో నిర్విరామంగా పనిచేయడం తమ వంతు అవుతోందని వాపోయారు. ఒక షిఫ్టులో 1012 గంటలు పనిచేయడం, అధిక పనిగంటలకు అదనపు వేతనం లేక తల్లడిల్లడం తప్పడం లేదన్నారు. కొవిడ్‌ వాక్సిన్‌ తీసుకోవడానికి తమకసలు సమయం లభించడం లేదని, ఒక వేళ అది తీసుకున్నాక తమకు ఏమైన జరిగితే అందుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని వర్కర్లు ప్రశ్నించారు. తాము భయపడటం లేదని, భయమే ఉంటే ఈ వృత్తిలోనే ఉండేవాళ్లం కాదని వారంటున్నారు. 13ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాగానీ ఉద్యోగ భద్రత లేదని నెలకు రూ.7వేలు మాత్రమే వస్తాయని విష్ణు అనే వర్కర్‌ తెలిపారు. తాను రోజూ ఇంటి నుంచి 45 నిమిషాలు సైకిల్‌ తొక్కి బైపాస్‌ రోడ్డును దాటుకొని శ్మశానవాటికకు చేరుకుంటాని, బట్టలు మార్చుకొని పని మొదలు పెడతా నని అన్నారు. కొవిడ్‌ రెండవ దశకు మునుపు బస్సులో ప్రయాణించే వాడినని చెప్పారు. విద్యుత్‌ శ్మశానాల ఆవర ణలు ఒక్కోరోజు వందకుపైగా మృతదేహాలతో నిండిపో తాయని మరొక వర్కర్‌ సుజిత్‌ అన్నారు. అలా గంటల పాటు పడివున్న శవాలను చూసి చాలా బాధ అనిపిస్తుం దన్నారు. రాత్రిపగలు అన్న తేడా లేకుండా దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రతినెలా కాంట్రాక్టరు వచ్చి జీతం ఇచ్చి వెళతారు. వేతన వ్యవస్థ గురించి ఆయనకు అవగాహన లేదు. పీపీఎఫ్‌ వంటి సౌకర్యాలు మాకు లేవు. 13ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నా గానీ ఉద్యోగ భద్రత లేదు. నేటికీ ఒప్పంద కార్మికుడిగానే ఉన్నా. శాశ్వత ఉద్యోగిని కాలేదు’ అని విష్ణు అన్నారు. అయితే, విష్ణు, సుజిత్‌లు ఇద్దరూ దళితులే. తాను సెక్యూ రిటీ గార్డుగా పనిచేస్తానని ఇంటి యజమానితో చెప్పాను.. అదే శ్మశానంలో పనిచేస్తానని తెలిస్తే వారు నన్ను, నా కుటుంబాన్ని బయటకు పొమ్మంటారు’ అని సుజిత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. భారత్‌లో కాటికాపరి వృత్తి కులాధిరతమైనదిగా ఉంది. బెంగళూరు శ్మశానాల్లో పనిచేసే వారిలో దాదాపు అందరూ దళితులే ఉన్నట్లు ఏఐసీసీటీయూ నివేదిక ఆధారంగా తెలిసింది. విష్ణు గతంలో తోటమాలిగా, సుజిత్‌ కాలిఘాట్‌ శ్మశాస సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. ఫర్నేస్‌ ఆపరేటర్‌ జీతం ఎక్కువని తెలిసి ఆ వృత్తిలోకి వచ్చారు. విష్ణు నెలకు రూ.7వేలు, సుజిత్‌ రూ.10వేలు చొప్పున సంపాదిస్తారు. ఇద్దరూ ఒప్పంద కార్మికులే కాగా వేతనాల్లో తేడా ఎందుకన్నది మాత్రం వారు చెప్పలేకపోయారు. త్వరలోనే తమ కష్టాలు తీరుతాయని, తమ శ్రమను గుర్తించి శాశ్వత ఉద్యోగులుగా చేస్తారని వారు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img