Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

వ్యవహారిక భాషోద్యమ సారథి గిడుగు

గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే చిన్న గ్రామంలోఒక సాదా సీదా కుటుంబంలోగిడుగు వీర్రాజు గిడుగు వెంకమ్మ దంపతులకు1863వ సంవత్సరం ఆగష్టు29వ తేదీన ప్రథమ సంతానంగా జన్మించారు. గిడుగు వీర్రాజు పూర్వ నివాసం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం తాలూకా, ఇందువల్లి గ్రామం. అయితే 1830వ సంవత్సరంలో కోనసీమలో వచ్చిన అనావృష్టి వల్ల విజయనగర సామ్రాజ్యంలో గల పర్వతాల పేటకువారి నాన్నగారు వలసవచ్చి విజయనగరంవాస్తవ్యులుగా రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ స్థిరపడ్డారు. గిడుగు వేంకట రామమూర్తి స్వగ్రామంలోనే 1875 దాకా ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తరువాత తండ్రి చోడవరం బదిలీ అవ్వటం, విషజ్వరంతో 1875లో మరణించటం జరిగింది. తండ్రి మరణానంతరం విజయ నగరంలో తన మేనమామ ఇంట్లో ఉంటూ గిడుగు వేంకట రామమూర్తి విజయ నగరం మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో చేరి 1879 లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అదే సంవత్సరం పెళ్లవటం, సంసార బాధ్యతలు పూర్తిగా తనపై ఉండటంచే 1880 లో 30 రూపాయల జీతంతో తాను చదివిన పర్లాకిమిడి రాజావారి పాఠశాలలోనే చరిత్ర బోధించే అధ్యాపకులయ్యారు. అదే పాఠశాలలో ఆనాటి మరో సంఘసంస్కర్త గురజాడ అప్పారావు తన సహ ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. గిడుగు రామమూర్తిఅంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు వ్యవహారికభాషోద్యమం. ఆ భాషోద్యమానికి కర్తగా, పరిశోధన కర్తగా, సవరహేతు వాదిగా, సంఘసంస్కర్తగా చిరపరిచయమైనప్పటికి, ఒరిస్సా ప్రాంతపు తెలుగు వారి హక్కుల కోసం రాజకీయ పోరాటం చేసిన గొప్ప యోధుడు రామమూర్తి. పర్లాకిమిడి పట్టణంలో 60 శాతం మంది తాలూకాలో 70 శాతం మంది తెలుగు వారు ఉండేవారు. వారందరికీ రాజావారి మాటే వేదం. రాజా వారికి ఎవరూ ఎదురు చెప్పరని కొంతమంది ఒరియావారు పర్లాకిమిడి పట్టణాన్ని పర్లకిమిడి తాలూకాలోని ఒరిస్సా చేర్చడం సబబు అని రాజుగారికి విన్నవించు కున్నారు. దానికి రాజు అంగీకరించారు. అయితే, ఆత్మాభిమానం కలిగిన కొంత మంది తెలుగు వారు దానిని వ్యతిరేకించారు. ఈ విషయాన్ని నిర్భయంగా, నిర్మొహ మాటంగా చెప్పగల సమర్థులు రామ్మూర్తి గారేనని భావించి వారిని ఆశ్రయించారు. దానికి వారు అంగీకరించి పర్లాకిమిడితో సహా మిగతా తాలూకాలని అవతరించబోయే ఒరిస్సాలో కలపమని ప్రతిపాదన అన్యాయమని, తెలుగు వారికి తీవ్ర నష్టం కలుగుతుందని రాజా వారికి వివరించారు. తన అభిమతానికి వ్యతిరేకమైన రామ్మూర్తి వాదన, రాజుకి కోపం తెప్పించింది. అలా రాజా వారితో వైరం మొదలైంది. ఆత్మాభిమానం కలిగిన తెలుగువారందరూ రామ్మూర్తి గారిని సంప్రదించిపర్లాకిమిడి దానితాలూకాలను ఒరిస్సాలో కలపడాన్ని ప్రతిఘటిం చాలని, దానికి వారిని నాయకత్వం వహించమని కోరడం జరిగింది, దానికి వారు సరేనని ఆమోదం తెలిపారు. తరువాత వారంతాకలిసి ‘‘యాంటీ ఏమల్గ మేషన్పార్టీని’’ నెలకొల్పారు.1931సం.లో పర్లాకిమిడి మునిసిపల్‌ ఎన్నికలు వచ్చాయి. పోటీ అంటే ఎరుగని రాజుగారు మొదటిసారి పోటీ రుచి చూశారు. దీనితో రాజా వారికి గిడుగుపై కోపం తారాస్థాయికి చేరుకుంది. 1932సం.లో తాలూకా బోర్డు ఎన్నికలు జరిగాయి. అప్పటికి ‘‘యాంటీ ఏమాలగమేషన్‌ పార్టీ’’ మరింత పుంజుకుంది. రామ్మూర్తి గారు ఉద్యమాన్ని బలంగా నడిపించారు. వీరి శ్రమ ఫలించి 16 సీట్లలో 9 సీట్లు ‘‘యాంటీ ఏమల్గమేషన్‌ పార్టీ’’ కైవసం చేసుకుంది. వెంటనే పర్లాకిమిడితో పాటు మొత్తం తాలూకాని ఒరిస్సాలో చేర్చ కూడదని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 1934సం.లో మళ్లీ మున్సిపల్‌ ఎన్నికలు వచ్చాయి.ఈసారి కొందరు వెన్నుపోటు పొడవటం చేత ‘‘యాంటీ ఏమల్గమేషన్‌ పార్టీ’’ ఓడిపోయింది. పర్లాకిమిడితో సహా పర్లాకిమిడి తాలూకా మొత్తాన్ని ఏర్పడబోయే ఒరిస్సా రాష్ట్రంలో కలపాలని కోరుతూ కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రభుత్వానికి సమర్పించింది. 1936 సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు ఒరిస్సా రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత ఇక అక్కడ ఉండలేనని సుమారు 56 సంవత్సరాలు నివసించిన పర్లాకిమిడి పట్టణాన్ని, సొంత ఇంటిని వదిలిపెట్టి రాష్ట్ర సరిహద్దులోని మహేంద్ర తనయ నదిలోతర్పణం వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చేరుకున్నారు.
సవర భాష: సవరలది అతి పురాతనమైన గిరిజన జాతి.సవరల ప్రస్తావన మన దేశ వాజ్మయంలో,రామాయణ, ఇతిహాసాలలోవుంది. సవరలు అమాయకులు, అనాగరికులు. సవరజాతి గిరిజనులకు చదువు చెప్పి విజ్ఞానవంతులుగా చేయ గలిగితే సవరల బతుకులు బాగుపడుతాయని భావించారు. వీరికి మాతృభాషలో విద్యాబోధన జరిగితే వారికి సులభంగా అర్థమవుతుందని, వారి భాషలోనే వారికి విద్య బోధన చేయాలని భావించి‘‘పోట్టెడు’’ అనే ఒరియా అతనికి సవర భాష వచ్చని తెలుసుకొని అతనినే గురువుగా చేసుకుని రెండేళ్ళపాటు సవర భాషను నేర్చుకున్నారు. తరువాత ఒకసారి కొండ సవరలు వారి ఇంటికి వచ్చినప్పుడు వారితో సవర భాషలో మాట్లాడడం, వారు ఆ భాష విని నవ్వుకోవడం ఇవన్నీ చూసిన తరువాత తను నేర్చుకున్నది స్వచ్ఛమైన భాష కాదని తెలుసుకొని, సవర భాష విపులంగా తెలిసిన మామిడన్నా కుమారస్వామి దగ్గర స్నేహం చేసి అతని దగ్గర మరో రెండు సంవత్సరాల్లో శుద్ధ సవర భాష నేర్చుకున్నారు.
ఆ విధంగా సవర భాష మీద పట్టు సంపాదించివారి పెద్దలకు తనపై విశ్వాసం, నమ్మకంకలగాలంటే వారితో కలిసి, మెలిసి, జీవించాలికనుక వారితో సహజీవనం చేసి, వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించారు. సవరభాషలో వాచకాలను, కథల పుస్తకాలను, పాటల పుస్తకాలను, తెలుగు- సవర, సవర-తెలుగు నిఘంటువులను తయారు చేశారు. ఈ కృషికి మెచ్చి మద్రాసు ప్రభుత్వం వారు 1913 లో ‘‘రావు బహదూర్‌’’ బిరుదుతో గిడుగు వారిని సత్కరించారు. సవర భాషా కృషికి మెచ్చిన బ్రిటిష్‌ ప్రభుత్వం 1933సం.లోకైజర్‌-ఇ-హింద్‌అనే బిరుదునిచ్చి బంగారు పతకంతో గౌరవించింది. 1935 సం.లో జార్జి చక్రవర్తి రజతోత్సవ పతకాన్ని కూడా గిడుగువారికి అందించారు. రామ్మూర్తి పంతులు గొప్ప భాషాశాస్త్రవేత్త.
సంఘ సంస్కర్త: నిమ్న జాతీయులు అనే దురాచారాన్ని రూపుమాపి వారి అభివృద్ధి కోసం ప్రారంభించిన ఉద్యమాలకంటే పూర్వమే రామ్మూర్తి పంతులు వారిని ఇంట్లో పెట్టుకొని విద్యాబుద్ధులునేర్పి వారి అభివృద్ధికి దోహదపడ్డారు. అంతేకాకుండా హరి జనులకోసం పెట్టిన బడులకు, విద్యాబోధనకుగానీ, తనిఖీలకుగానీ అగ్రకుల ఉపాధ్యాయులు వెళ్లనిసందర్భాలలో రామ్మూర్తిపంతులువారు సంతోషంగా వెళ్లేవారు.
తెలుగు వ్యవహారిక భాషోద్యమం: గిడుగు వారు భాషా పరంగా చేసిన కృషి కేవలం వాడుక భాషకు మాత్రమే కాదు, అది అనాటి తెలుగువారి విద్యకి, పాలనకి సంస్కృతికి సంబంధించిన సమస్యకు కూడా ఎందుకంటే అది బ్రిటిష్‌ పాలకుల ద్వారా భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుండి పాఠశాలల వరకు ఇంగ్లీషు విద్యలోనే బోధనా భ్యాసం జరగాలని కొత్త విద్యా సంస్కరణలు చేస్తున్న సమయం. ఈ కొత్త విద్యా సంస్కరణలు కేవలం పట్టణాలలో ఉండే ఉన్నతవర్గానికి తప్ప గ్రామీణ సామాజాలకు గాని, అట్టడుగు వర్గాలకు గాని, దేశ భాషలకు గాని ఎలాంటి ఉపయోగంలేనివి అని గ్రహించి ఉద్యమించిన మహనీయులలో ముఖ్యులు రాజా రామ్మోహన్‌ రాయ్‌, మహాత్మా జ్యోతిబాఫూలే, మన గిడుగు వేంకట రామమూర్తిపంతులుగారు. భారత దేశంలో విద్య అన్ని వర్గాలలో ఉండే ప్రతి ఒక్కరికీ అందాలనీ అది వారి వారి మాతృభాషలోనేజరగాలనీ, విశ్వ విద్యాలయ విద్యతో పాటు ప్రాథమిక మాధ్యమికవిద్య బలోపేతం కావాలనీ వ్యవహారిక భాషోద్యమానికి తెర తీశారు. మరొకవైపు ఆనాటి సాహిత్యం, పాఠ్యపుస్తకాలు, పత్రికలు, పరిపాలన భాషల్లో సాధారణ ప్రజలకు అర్థం కాని కావ్యభాష/గ్రాంధికభాష పనికిరాదని సాంప్రదాయిక పండితులతో హోరా హోరీగా యుద్ధంచేయసాగారు. వ్యవహారిక భాషోద్యమానికి తన సహఉపాధ్యాయుడు సంఘసంస్కర్తలయిన గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు ఊతంఇవ్వటంచేత వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రికను ప్రచురించటం మొదలుపెట్టారు. రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడుగా, గిడుగువారు కార్యదర్శిగా ‘‘వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం’’ స్థాపించటమే కాకుండా తను పాల్గొనే ప్రతి సభలో వ్యవహారిక భాష యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేసే వారు. అలా తన ఈ ఉద్యమంను నెమ్మదిగా కవి పండితులు, సాహిత్యసమాజాలు, పత్రికలు బలపరుస్తూ వ్యవహారిక భాషపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి వ్యవహారిక భాషనే వారు వినియోగించటం మొదలుపెట్టారు. తెలుగు వాడుకభాష వ్యాప్తి కోసం అలనాడు గిడుగు వేంకట రామమూర్తిపంతులు చేసిన కృషి చిరస్మరణీయం. వాడుక భాషోద్యమ పితా మహుడిగా, సంఘ సంస్కర్తగా చెరగని ముద్రవేసిన ఆయన గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు ఆయన జన్మదినాన్ని ‘ఆగస్టు 29న తెలుగు భాషాదినోత్సవం’గా ప్రకటించి ప్రతిఏటా రాష్ట్రపండుగగా నిర్వహిస్తున్నారు.
-ఆర్‌.మల్లికార్జునరావు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు
చ. సం. 9491659899

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img