Friday, May 31, 2024
Friday, May 31, 2024

43 స్థానాల్లో ‘రెడ్‌ అలర్ట్‌’

మూడవ దశలో 18శాతం మంది అభ్యర్థులు నేరచరితులు

సార్వత్రిక ఎన్నికల మూడవ దశలో 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే7న పోలింగ్‌ జగరబోతోంది. ఇందులో 43 స్థానాల్లో ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించారు. అంటే ఈ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులలో ముగ్గురికిపైగా నేరచరితులు ఉన్నారు. ఈసారి పోటీ చేయబోయే మొత్తం అభ్యర్థుల్లో 18శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదించింది. 94 స్థానాల నుంచి 1,325 మంది బరిలో నిలిచారు. వీరిలో 244 మందిపై క్రియమల్‌ కేసులు ఉన్నాయని నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌, ఏడీఆర్‌ పేర్కొన్నాయి.
172 మంది అభ్యర్థులపై (13శాతం) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉండగా ఐదుగురిపై హత్య కేసులు, 38 మందిపై అత్యాచారంతో పాటు మహిళలపై నేరాలకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. 17 మందిపై విద్వేష ప్రసంగాలు చేసినట్లు కేసులు ఉన్నాయని తేల్చింది. నేరచరితులైన అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న 82 మందిలో నుంచి 27శాతం అంటే 22 మంది ఉండగా, కాంగ్రెస్‌ నుంచి 68 మందిలో 38శాతం అంటే 26 మంది ఉన్నట్లు వెల్లడైంది. అలాగే రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) తరపున బరిలో నిలిచిన ముగ్గురికి ముగ్గురు కూడా నేరచరితులే అని నివేదిక పేర్కొంది. ఇక శివసేన (యూబీటీ) అభ్యర్థులలో 80శాతం, ఎన్సీపీ(శరద్‌ చంద్ర పవార్‌)లో 67శాతం, సమాజ్‌ వాదీ పార్టీలో 50శాతం, జనతా దళ్‌ (యునైటెడ్‌)లో 33శాతం, ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌లో 17 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు పేర్కొంది. ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్న స్థానాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటిస్తారు. తాజా ఎన్నికల్లో రెడ్‌ అలర్డ్‌ స్థానాలు 45శాతం అంటే 43గా ఉన్నాయి.
29 శాతం మంది కోటీశ్వరులు
మూడవ దశలో పోటీ చేసే 1,352 మందిలో నుంచి 29శాతం అంటే 392 మంది అభ్యర్థులు కోటీశ్వరులున్నారు.
టాప్‌ 3లో బీజేపీ అభ్యర్థులు ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు ఉన్నారు. గోవా బీజేపీ అభ్యర్థి పల్లవి శ్రీనివాస్‌ డెంపో (రూ.1361 కోట్లు), మధ్యప్రదేశ్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న జ్యోతిరాదిత్య సింధియా (రూ.424 కోట్లు), మహారాష్ట్ర బరిలో నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఛత్రపతి సాహు షహాజీ (రూ.342 కోట్లు) ఉన్నారు. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల్లో 94శాతం అంటే 77 మంది కోటీశ్వరులు కాగా కాంగ్రెస్‌లో 60 మంది ఉన్నారు. జేడీయూ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీశరద్‌పవార్‌ పార్టీల అభ్యర్థుల్లో అందరూ కోటీశ్వరులే ఉన్నారు. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి విలువ రూ.5.66 కోట్లుగా ఉన్నది. ఈలెక్కన బీజేపీకి చెందిన 82 మంది అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ.44.07కోట్లు కాగా 68మంది కాంగ్రెస్‌ అభ్యర్థుల సగటు ఆస్తి విలువ రూ.20.59 కోట్లుగా ఉంది. జీరో అసెస్ట్స్‌ (ఎటువంటి ఆస్తులు లేని) అభ్యర్థులు ఐదుగురు ఉన్నారు. 44శాతం మంది విద్యావంతులు అభ్యర్థుల విద్యార్హతలను గమనిస్తే 591 మంది (44శాతం) గ్రాడ్యుయేషన్‌ లేక ఆపై చదువు చదివినట్లు పేర్కొన్నారు. 44 మంది డిప్లోమా చేసినవారు కాగా 639 మంది (47శాతం) 6 నుంచి 12 తరగతి వరకు చదివిన వారున్నారు. 56 మంది తాము అక్షరాస్యులమనగా... 19 మంది తాము నిరక్షరాస్యులమని వెల్లడిరచారు. తొమ్మిది శాతమే మహిళలు మూడవ దశలో మహిళా అభ్యర్థులు తొమ్మిది శాతం మందే ఉన్నారు. కాగా, 4160 మధ్య వయస్కులు 712 మంది, 61`80 ఏళ్ల మధ్య వయస్సుగల వారు 228 మంది చొప్పున ఉన్నారు. తనకు 84 ఏళ్లు ఉన్నట్లు ఒక్క అభ్యర్థి మాత్రమే ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img