పాట్నా- బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ నుండి ఢిల్లీకి వెళుతుండగా సమస్తిపూర్ వద్ద ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. సోమవారం నాడు దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న బీహార్ సంపర్క్ క్రాంతి రైలు ఖుదీరామ్ బోస్, పూసా సమస్తిపూర్‌లోని కర్పూరి గ్రామ్ రైల్వే స్టేషన్, ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్ మధ్య దాని కప్లింగ్ తెగిపోయింది. దీంతో ఆ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. తిరిగి ఆ రైలు కప్లింగ్ కు మరమతులు చేసి తిరిగి న్యూ ఢిల్లీకి పంపారు.. ఈ ఘటనపై విచారణ జరపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు..