Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

మోడీని రావణుడితో పోల్చిన రాహుల్ .. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోడీని రావణుడితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోల్చారు. దీంతో సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడుగడుగున అడ్డుపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.అవిశ్వాసంపై బుధవారంనాడు లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. మణిపూర్ హింసపై రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ ప్రధాని మోడీని రావణుడితో పోల్చారు. రావణుడు కూడ ఇద్దరి మాటలే వింటాడు…అదే రీతిలో కూడ మోడీ కూడ ఇద్దరి మాటలను వింటాడని రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలనే రావణుడు వినేవాడన్నారు. అమిత్ షా, అదానీ మాటలను మాత్రమే మోడీ వింటాడన్నారు. రావణుడి అహంకారమే నాడు లంకను కాల్చేసిందన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకున్నారు. రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారతీయుడే కాదన్నారు. రాహుల్ వ్యాఖ్యలను జాతి క్షమించదన్నారు. మణిపూర్ రెండుగా చీలలేదని కేంద్ర మంత్రి చెప్పారు. భరతమాతను చంపేశారని సభలో ఇప్పటివరకు ఎవరూ అనలేదని ఆమె గుర్తు చేశారు. భరతమాతను హత్య చేశారంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారని ఆమె మండిపడ్డారు. మీరు ఇండియా కాదు.. అవినీతికి ప్రతిరూపంగా కేంద్ర మంత్రి ఇరానీ పేర్కొన్నారు.మణిపూర్ భారత్ లో అంతర్భాగంగా ఆమె పేర్కొన్నారు. దేశంలో అవినీతిని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. గిరిజా టిక్కు, సరళా భట్ వంటి ఘటనలు కాంగ్రెస్ హయంలోనే జరిగాయన్నారు.ఆర్టికల్ 370 రద్దు వల్లే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని ఆమె చెప్పారు. కాశ్మీర్ పండితులకు కాశ్మీర్ మహిళలకు జరిగిన అన్యాయం రాహుల్ కు కన్పించలేదా అని ఆమె ప్రశ్నించారు.మణిపూర్ ఘటనపై ఇవాళ సీబీఐ విచారణ ప్రారంభించిందన్నారు. రాజస్థాన్ లో ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.మణిపూర్ లో శాంతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img