Friday, May 17, 2024
Friday, May 17, 2024

యుద్ధ వీరులు

యుద్ధ వీరులుగా పేరు పొందిన సామాజిక వర్గాలు క్రమంగా మోదీకి వ్యతిరేకులుగా మారిపోతున్నారు. ఉత్తర భారత్‌లో రాజపుత్రులు (ఠాకూర్లు లేదా క్షత్రియులు), సిక్కులు, జాట్లు, భిల్లులు, పసీలు మోదీ వ్యతిరేకులుగా మారుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో కుల సమీకరణల్లోనూ మార్పు వస్తోంది.
బహుజనుల తరఫున మాట్లాడే బీఎస్పీ అధినేత మాయావతి ఇటీవల గాజియాబాద్‌లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ క్షత్రియులను సమర్థించారు. ఇప్పటి దాకా మాయవతి క్షత్రియులను వ్యతిరేకిస్తారన్న అభిప్రాయం ఉంది. ఆమె అగ్రవర్ణానికి చెందిన బ్రాహ్మణులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే వారు. కాని ఈ సారి ఆమే అయిదుగురు ఠాకూర్లకు బీఎస్పీ తరఫున పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
బీజేపీ తమను సవతి పిల్లల్లా చూస్తోందని ఇటీవల ఠాకూర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌ వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఆ వర్గాన్ని చేరదీస్తున్నాయి. దీనికి కారణం ఉంది. ముస్లింలు, దళితుల తరవాత పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మూడవ అతి పెద్ద సామాజిక వర్గం క్షత్రియులదే. గాజియాబాద్‌, షహరాన్‌ పూర్‌, మీరట్‌, కైరానా, గౌతమ బుద్ధ నగర్‌, ముజఫ్ఫర్‌ నగర్‌, బాగ్‌పత్‌, అలీగఢ్‌లో క్షత్రియులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయినప్పటికీ ఈ వర్గం వారికి మోదీ నాయకత్వంలోని బీజేపీ కొద్ది స్థానాల్లో పోటీి చేయడానికి మాత్రమే వీరికి టికెట్లు ఇచ్చింది. ఠాకూర్లు కనక

బీజేపీకి వ్యతిరేకులుగా మారితే ఆ ప్రభావం గుజరాత్‌ నుంచి బీహార్‌-బెంగాల్‌ సరిహద్దు దాకా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది మూడో సారి అధికారంలోకి రావాలన్న మోదీ ఆకాంక్షల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది. ఠాకూర్లు మోదీకి దూరం అవుతున్నారని గుజరాత్‌, రాజస్థాన్‌, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని ఠాకూర్లు బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ లాంటి నియోజకవర్గాలలో బ్రాహ్మణేతర వర్గాల అభ్యర్థులను సమర్థిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో బ్రాహ్మణాధిపత్యం కొనసాగడమే దీనికి
కారణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img