Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాల ఏర్పాటు

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు:ఓటర్లు తమఓటుహక్కుఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ఎం. హరి నారాయణన్ చెప్పారు. బుధవారం స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ లో ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లోప్రతి ఒక్కరు తమఓటుహక్కునువినియోగించుకోవాలన్నారు.మే 13వ తేదీ ఉదయం 7 గంటలనుండి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరుగుతుందన్నారు. భారత్ ఎన్నికలసంఘంఆదేశాల మేరకుఓటర్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంజరుగుతుందన్నారు.జిల్లాలో ఓటుహక్కు శాతాన్ని పెంచడానికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.జిల్లాలో నెల్లూరు నగరంలోముఖ్యమైనప్రాంతాల్లో
మున్సిపాలిటీల్లో నియోజకవర్గ కేంద్రాలలో ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్మార్ట్ ఫోన్ లేనివారు సమీపంలోని ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు ఎక్కడుందో తెలుసుకోవచ్చు అన్నారు. ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నది కూడా ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాలలోతెలుసుకోవచ్చు నన్నారు. ఈ కార్యక్రమంలో నుడా వైస్ ఛైర్మన్ టి.బాపి రెడ్డి, డి.అర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img