Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

జగనన్న సురక్ష కార్యక్రమం పై సమీక్షాసమావేశం

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలంలో త్వరలో జరగబోవు కొండ సముద్రం, సమీర్ పాలెం, పోకురు మరియువలేటివారి పాలెం గ్రామ సచివాలయం కు సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమం పై సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది మరియు వలంటీర్లతో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోభిక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో గృహసర్వే 90శాతం పూర్తి చేయాలని, సర్వే యొక్క ప్రాముఖ్యత ప్రజలకు అందరికీ తెలియజేసి వారికి అవసరమైనధ్రువ పత్రములు పూర్తిగా ఉచితంగా అందజేయబడునని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ఇందుకు భిన్నముగా ప్రవర్తించిన యెడల తగు క్రమశిక్షణ చర్యలుతీసుకోవటం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డి ఎల్ డి వో పద్మజ,తహసీల్దార్ సుందరమ్మ ఎంపీడీవో రఫిక్ అహ్మద్ మరియుఈవో పీ ఆర్డీ సుమంత్,పంచాయతీ కార్యదర్శులు, సచివాలయసిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img