Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

వత్సవాయమ్మ తిరునాళ్ళపై భక్తుల అసంతృప్తి

సొంత గ్రామం వారి వద్ద కూడా పది రూపాయలు వసూళ్లు

గ్రామ దేవుని దర్శించుకోవడానికి పది రూపాయలు చెల్లించాలా

ఎక్కడా కనిపించిన మంచినీటి కేంద్రాలు
నాణ్యత ప్రమాణాలు లేని లడ్డూలతో భక్తుల అసంతృప్తి

ఎక్కడ కనిపించని చెప్పుల స్టాండ్

ఆలయం చుట్టూ తిరిగే వారికి సదుపాయాలు లేక ఇబ్బందులు
( విశాలాంధ్ర) వత్సవాయి : మండల కేంద్రమైన వత్సవాయిలో వేంచేసి ఉన్న వత్సవాయమ్మ తిరునాళ్లపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు…. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన గ్రామస్తుల దగ్గర నుండి ప్రతి మనిషికి పది రూపాయలు వసూలు చేయడంతో స్వగ్రామస్తుల వద్ద నుండి కూడా పది రూపాయలు వసూలు చేయడంతో… మా సొంత గ్రామదేవతను సందర్శించుకోవడానికి మేము సైతం పది రూపాయలు చెల్లించాలా అని బాధను వ్యక్తం చేస్తున్నారు…. దేవదాయ శాఖ వారు నావమాత్రంగానే వ్యవహరిస్తూ కనీసం వచ్చే భక్తులకు మంచినీరు, మరుగుదొడ్లు, మొదలగు వసతులు కూడా కల్పించడంలో విఫలమయ్యారు…. ఇప్పటికయినా సంబంధిత అధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు……

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img