Monday, April 22, 2024
Monday, April 22, 2024

నాసా సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌కి ఎంపికైన శ్రీచైతన్య విద్యార్థులు

విశాలాంధ్ర - విజయవాడ : ఇటీవల అంతర్జాతీయ నాసా స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌కి శ్రీచైతన్య స్కూల్‌ ఏలూరు రోడ్డు మారుతీనగర్‌ బ్రాంచ్‌ నుంచి 26మంది విద్యార్థులను ఎంపిక చేయగా వారిలో ఇంటర్నేషనల్‌ అవార్డు2కు 5మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఏ.శివనాగభద్రి (6వ తరగతి) ఎస్‌. ప్రవిషంత్‌ చరణ్‌ (6వ తరగతి) ఎం. డూండీ షణ్ముఖ శ్రీనివాస్‌ (7వ తరగతి) వి.పవన్‌ (7వ తరగతి) ఎస్‌. పుషన్‌ (7వ తరగతి) అవార్డుకు అర్హత సాధించారు. వీరికి పాఠశాల ఈజీఎం మురళీకృష్ణ మెమెంట్స్‌, సర్టిఫికెట్లు, మెడల్స్‌ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్య కరిక్యులమ్‌లో విద్యార్థులు పాల్గొని విజయాన్ని సాధించగలిగారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆర్‌.ఐ. రాజేష్‌బాబు, ప్రిన్సిపాల్‌ సుజన, కో ఆర్డినేటర్‌ అశోక్‌, డీన్‌. మీనాచారి దాస్‌, సి.బ్యాచ్‌ ఇన్‌ఛార్జ్‌ పవన్‌ కోటేశ్వరరావు, తలిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img