Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం – దోనేపూడి

సిపిఐ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ ను తరలించాలని సంతకాల సేకరణ

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులకు పట్టవా
ప్రజా ఆరోగ్యం కోసం పోరుబాటకు సిద్ధం
ప్రజా సమస్యలపై పడగ విప్పిన సిపిఐ

వ్యర్ధాలతో పేట ప్రజలకు పొంచి ఉన్న ముప్పు
మద్దతు ఇచ్చిన వార్డు కౌన్సిలర్లు
పాలేరు నదీ పరివాహక ప్రాంతం కలుషితం
సంతకాల సేకరణకు అనూహ్య స్పందన
బారులు తీరిన మహిళలు

విశాలాంధ్ర: జగ్గయ్యపేట నియోజకవర్గం సహాయ కార్యదర్శి అంబోజి శివాజీ మరియు, పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి, జగ్గయ్యపేట ఇంచార్జ్ కామ్రేడ్ దోనేపూడి శంకర్ పేట ప్రజల సమస్యలపై పడగ విప్పారు విస్తృత స్థాయిలో ప్రజా సమస్యల పోరుకు నడుంబిగించారు….. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పేటలో ఉన్న సమస్యలపై నిరంతరం తెలుసుకుంటూ ఉద్యమాలను ఉదృతం చేశారు దోనేపూడి ముత్యాల రోడ్డులో విలియంపేట సమీపంలో ప్రజారోగ్యానికి హానికరంగా మారిన చెత్త డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని శనివారం నాడు ఆ ప్రాంత ప్రజల సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు…. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులకు పట్టవా? అని…. సూటిగా ప్రశ్నించారు…. ఎన్నికల సమయంలో అబద్ధపు వాగ్దానాలు చేసి ఒడ్డెక్కిన నాయకులు ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎందుకు గుర్తించడం లేదని? ప్రశ్నల వర్షం కురిపించారు…… ప్రణాళికాబద్ధంగా ప్రజారోగ్యానికి హానికరంగా ఉన్న చెత్త డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని మరియు నదీ పరివాహక ప్రాంతంలో వ్యర్ధాలు అసంఖ్యాకంగా ఉండడంతో నీరు కలుషితం అయ్యే అవకాశం లేకపోలేదని ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్య పరిష్కారానికి ఎందుకు ముందుకు రారని? అన్నారు…… టిడ్కో గృహాల విషయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఉదృతస్థాయి ఉద్యమాల వల్లనే….నాలుగు నెలల్లో గృహప్రవేశాలు చేస్తామని…. స్థానిక శాసనసభ్యులు సభాముఖంగా తెలిపారు.అని …… సిపిఐ పార్టీ శ్రేణుల తీవ్ర ఉద్యమ స్థాయి వల్లనే శాసనసభ్యులు నోరు పేకలిందని దీనిని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు… ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని…. ప్రజా సమస్యలను ప్రజా ఆరోగ్యాన్ని పక్కకు పెట్టి రాజకీయాలు చేసినట్లయితే భారత కమ్యూనిస్టు పార్టీ చెంపపెట్టుగా తీవ్రస్థాయి ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు…….. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ సంవత్సరాలు గడుస్తున్నా ప్రజా ప్రతినిధులకు సంబంధిత అధికారులకు ఈ చెత్త కనిపించడం లేదా? అనారోగ్యానికి కేరాఫ్ అడ్రస్ గా విలియంపేట అడ్డాగా మారిన విషయం? తెలియదా అని అసహనం వ్యక్తం చేశారు సంవత్సరాలు గడుస్తున్నా ప్రజా ప్రతినిధులు,స్థానిక శాసనసభ్యులు ఈ విషయంపై ఎందుకు దృష్టిసారించడం లేదని…. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని ప్రజారోగ్యాలు ఏమైపోయినప్పుడు కూడా వారు వేసే ఓట్లకు మాత్రమే విలువ ఉంటుంది కానీ ప్రజల ఆరోగ్యానికి విలువ ఉండదని ఆయన ఎద్దేవా చేశారు….. పేటలోని విలియంపేట లో ఉన్నటువంటి చెత్త డంపింగ్ యార్డ్ ను తరలించే వరకు కూడా జగ్గయ్యపేట తరఫున భారత కమ్యూనిస్టు పార్టీ అ విశ్రాంతంగా తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు… సంతకాల సేకరణకి మద్దతుగా 14వ వార్డు నకిరికంటి వెంకట్,9 వ వార్డు కౌన్సిలర్ పేరం సైద్దేశ్వరావు,10 వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మీ 12 వార్డ్ కౌన్సిలర్ వెదులా పూడి అలేఖ్య సైదా నాయుడు కర్ల జోజి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు యన్.టి.ఆర్ జిల్లా సమితి సభ్యులు కెవి భాస్కరరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ సహాయ కార్యదర్శి అంబోజి. పట్టణ సహాయ కార్యదర్శిమాశెట్టి రమేష్ బాబు శివాజీ,భోగ్యం నాగులు,మెటికల శ్రీనివాసరావు,షేక్ జాని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img