Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అబద్ధాల చక్రవర్తికి లేరెవ్వరూ సాటి!!

షాయిస్తా ఖానూమ్‌ పఠాన్‌
అబద్ధం… ఓ అందమైన నిజం. ఇందుకు ప్రతి రూపమే మన నరేంద్రుడు. నోరు విప్పారంటే ఆగవు అసత్య బాణాలు. అసత్యాల వాక్కులలో లేరెవ్వరూ ఆయనకు సాటి. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు దశలు ముగిశాయి. ప్రతి దశ తర్వాత కమలం కోటలో బీటలు పెద్దవవుతున్నాయి. ఓటమికి చేరువవుతున్నామని గ్రహిస్తున్న కమలనాధులు ఆందో ళనకు గురవుతున్నారు. గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికల వేళ కాషాయ కుయుక్తులు ప్రదర్శిస్తున్నారు. విపక్షాలపై బురద జల్లడంలో, మైనారి టీలపై విషం చిమ్మడంలో…. ఉన్నది లేనట్లు… లేనిది ఉన్నట్లు సృష్టించడంలో రారెవ్వరూ తమకు సాటని నిరూపిస్తున్నారు.
నరేంద్రుడి అబద్ధాలలో కొన్ని….
1) మే 8 : ‘అంబానీ, అదానీ గురించి రాహుల్‌ మాట్లాడటంలేదు
ఈ వ్యాఖ్యలను తెలంగాణలోని కరీంనగర్‌లో నిర్వ హించిన బీజేపీ ప్రచార ర్యాలీలో నరేంద్ర మోదీ చేశారు. గౌతం అదానీ, ముకేశ్‌ అంబానీలతో కాంగ్రెస్‌కు ఒప్పందం కుదిరిందని అవినీతి సొమ్ముతో అందిన ముడుపులను స్వాహా చేసి నోరు మెదపడం లేదని ఆరోపించారు.
నిజం …
ప్రధాని మోదీ పూర్తిగా అబద్ధం చెప్పారని నిజ నిర్థారణ జరిగింది. కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా అంబానీ, అదానీ విషయంలో మౌనం వహించలేదని తేలింది. గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు అంబానీఅదానీకి దేశాన్ని దోచి పెడుతున్నదని మోదీ ప్రభుత్వమేననీ ప్రతిపక్ష నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారు. రాహుల్‌ అనేక ప్రసంగాల్లో ఈ ఇద్దరు పారిశ్రామిక వేత్తల గురించి మాట్లాడారు. ఈనెల 7న జార్ఖండ్‌లోని కోంబిర్‌లో నిర్వహిం చిన ప్రచార సభలోనూ అంబానీ, అదానీ ప్రస్తావనను రాహుల్‌ తెచ్చారు. గిరిజనులకు చెందిన అటవీ భూములను ఈ ఇద్దరికి దారాదత్తం చేయాలని బీజేపీ కోరుకుంటోదని వ్యాఖ్యానిం చారు. అంబానీ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను 24 గంటలు ప్రసారం చేస్తారు కానీ ఓ గిరిజనుడు హత్యకు గురైనా, చేతులు జోడిరచి వేడుకుంటున్న సన్నివేశాలను మీడియా చూపించదని విమర్శించారు. అలాగే మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోనేలో ఈనెల 6న జరిగిన ర్యాలీలోనూ జల్‌ జంగల్‌జమీన్‌ అంటూ రాహుల్‌ మాట్లాడారు. ‘హిందూస్తాన్‌ను 2225 మంది పాలిస్తారు. వీరంతా ఎవరో కాదు మన దేశంలోని సంపన్నులు’ అని ఘాటు విమర్శలు చేశారు. అదానీ వంటి వారు మీ భూములు, అడవులు, నీటి వనరులపై కన్నే శారని, వాటిని స్వాహా చేయాలని చూస్తు న్నారని, ఇందుకోసం వారికి వారి ఆప్తమిత్రుడు నరేంద్ర మోదీ సహాయ సహకారాలు అందజేస్తున్నారని దుయ్యబట్టారు. 22`25 మందికి రూ.16 లక్షలకోట్ల రుణాలను మోదీ మాఫీ చేశారని వ్యాఖ్యానించారు.
2) మే 7: ‘ఓటు జిహాద్‌’ కోసం కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనేలో నిర్వహించిన ప్రచారంలో నరేంద్ర మోదీ ‘ఓటు జిహాద్‌’ గురించి ఇలా మాట్లాడారు. మీకు ఓటు జిహాద్‌ కావాలో రామ రాజ్యం కావాలో తేల్చుకోండి. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు భారత్‌లో జిహాద్‌ చేస్తున్నారు. మాకు వ్యతిరేకంగా ఓటేసేందుకు ఒక మతం వారంతా ఏకమయ్యారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల రిజర్వే షన్లను ముస్లింలకు కాంగ్రెస్‌ దోచిపెట్టనున్నది. కశ్మీర్‌లో అధికరణ 370 పునరుద్ధరణ, మతాధారంగా క్రీడాకారుల ఎంపిక వంటి అంశాలతో మతచిచ్చు పెట్టాలని చూశారు. ముస్లింలను బూచీలుగా చూపుతూ హిందువుల ఓట్లను దండుకోవాలని మత రాజకీయాలను కొనసాగిస్తున్నారు.
నిజం …
ప్రధాని మాటల్లో ఏ మాత్రం నిజం లేదు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోగానీ ప్రచార ప్రసంగాల్లోగానీ ‘ఓటు జిహాద్‌’ మాటే రాలేదు. హిందువుల సొమ్ములను ముస్లింలకు దోచిపెట్టే అంశం ఎక్కడా లేదు. అధికరణ 370 ప్రస్తావన లేదు. 1985లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండి, యూపీలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు బాబ్రీ మసీదు తాళాన్ని తెరపించారు. కాగా, క్రీడల విషయంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇలా పేర్కొన్నది ‘‘21ఏళ్లలోపు నైపుణ్యవంతులైన క్రీడాకారులకు నెలకు రూ.10వేల స్కాలర్‌షిప్‌ లిస్తాం. ప్రతి జిల్లాలో బహు క్రీడల కోచింగ్‌ సెంటర్‌, ప్రతి మున్సిపల్‌ పట్టణం, మండ లంలో కమ్యూనిటీ స్పోర్ట్స్‌కు హామీనిస్తున్నాం. బాలికలు, మహి ళలు, దివ్యాంగులు, ఎస్టీ తరహా అణగారిన వర్గాల వారిలో క్రీడలను ప్రోత్సహించేలా సముచిత నిధులను కల్పిస్తాం’’.
3) ఏప్రిల్‌ 29: ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను ుుస్లింలకు కాంగ్రెస్‌ దోచిపెడుతోంది
మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించిన సమయంలో మోదీ మరో ఆలోచన లేకుండా అవాస్తవాలు పలుకుతూ మోదీపై దాడి చేశారు. షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ) రిజర్వేషన్లను ముస్లిం లకు దోచిపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వర్గం మెప్పు పొందే ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ చేస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.
నిజం…
ముస్లింలకు ప్రత్యేకించిన రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఏమీ లేదు. రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్‌ హామీనిచ్చింది. కులమతాలతో పనిలేకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) వారికి విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముస్లిం ఓటర్లకు నాలుగు శాతం కోటా కల్పిస్తామని ప్రతి ప్రసంగంలోనూ హామీనిచ్చారు. కానీ మోదీ ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావించలేదు.
4) ఏప్రిల్‌ 21: మీ డబ్బు, బంగారం, ఆస్తులు, మంగళసూత్రాలను సైతం ముస్లింలకు కాంగ్రెస్‌ దోచిపెడుతుంది. ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలదే అని కాంగ్రెస్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రాజస్థాన్‌లోని బాన్స్‌వారాలో నిర్వహించిన ప్రచారంలో మోదీ ఈ మేరకు అబద్ధాలు పలికారు
నిజం …
ప్రత్యేకించి ఒక వర్గానికి దేశ సంపదను తిరిగి పంపిణీ చేయడం గురించి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఏమీ లేదు. పెరుగుతున్న అసమానతలు, సంపద మొత్తం ఒకశాతం వద్ద కేంద్రీకృతం కావడాన్ని ప్రస్తావిస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2006లో ఇచ్చిన ప్రసంగాన్ని మోదీ తప్పుగా అన్వయించుకొని అవాస్తవాలను ప్రచారంచేశారు. మన్మోహన్‌ ఏం చెప్పారంటే ‘‘అభివృద్ధి ఫలాలను సమా నంగా పంచడానికిగాను మైనారిటీలు ముఖ్యంగా ముస్లింల సాధికారత కోసం వినూత్న ప్రణాళికలను రూపొందించు కోవాల్సి ఉన్నది’’. మోదీ మాత్రం తనకు తోచిన వ్యాఖ్యలను 2006 నుంచి 2024 వరకూ చేస్తుండటం ఆయన విజ్ఞతనే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. తమ మేనిఫెస్టోలో హిందూ, ముస్లిం అని చూపగలరా అంటూ మోదీకి కాంగ్రెస్‌ సవాల్‌ విసిరింది. యువత, మహిళలు, రైతులు, గిరిజనులు, మధ్య తరగతి, కార్మికులకు న్యాయం గురించి మేము ప్రస్తావించాం. దానినీ కాదంటారా అని ప్రశ్నించింది. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంతమైపోతే అంబేద్కర్‌, నెహ్రూ ఆకాంక్షించినట్లు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండదని, ఆ హక్కు వల్లనే అన్ని వర్గాలకు సముచిత గౌరవం లభించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఓ సందర్భంలో అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img