Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

అవునా`నిజమా

బాధపడకు నాయనా బాధ పడకురా నీ సమస్యలన్నీ నేను తీర్చగలనురా ప్రజలంతా నా మాట నమ్మి ఓటువేయండిరా ఆపదమొక్కుల వాడికంటే నన్ను నమ్మరా. అబ్బో ఏంటి బావ ఈసారి చాలా పొడవైన పాటందుకున్నావు. అవునుమరి సమస్యల తోరణం పొడవైతే నా వాగ్దానాలు పొడవె మరి. అవును ఇదంతా నిజమా. ఆ అనుమానం నీకేల ప్రతిసారి నమ్మి ఓటేసి ఈసారి అనుమానిస్తునా ్నరేంటి అంతేనంటావా నిజమేనా..ఎందుకోయ్‌ ఆ అనుమానం. ఆ ఏం లేదు. గతంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు జరగలేదుగ. అందుకేగా సినిమా వాళ్ల్లను దించుతున్నాను. నిజమేలే ఒకాయన ఓటర్లు గొర్రెల మందలు ఆ మూకను కొని పారెయ్యండిరా అన్నాడట. అంటాడోయ్‌ ఇంకేమైనా అంటాడు. అన్నట్లుగానే ఓటర్లు అమ్ముడు పోతున్నారుగ. అదేం కాదులే అది గతం. ఇప్పుడు డబ్బులు తీసుకున్నా ఆలోచించి ఓట్లు వేస్తున్నారు. అది సరే పరదా చాటున ఉండే మహారాణులు మండుటెండలో తిరుగుతున్నారేంటి. అవసరం బావ అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకువెళుతుంది. ఇంతకు ఎవరు వారు. ఎవరని నిదానంగా అడుగుతావేంటయ్యా. రోడ్లన్ని జనంతో నిండి పోతుంటె చంద్రబాబు భార్య, కోడలు, జగన్‌ భార్య, బాలకృష్ణ భార్య ఇలా పోటీలో ఉన్నవారి భార్యలు, అక్క చెల్లెళ్లు, కోడళ్లు వారు వీరేమిటి పెళ్లి ఆహ్వానంతో పిలిచినట్లుగా పోటీలో ఉన్నవారి బంధుమిత్ర సపరివార ంగ ప్రచారంలో దిగిపోయారు. నిజమె ఈసారి ప్రచారం కొత్తగా ఉంది. ఊరికొకరు వీధి కొకరు సీరియల్‌, సినిమా, జబర్దస్తు వారు దిగిపోయారనుకో. ఇంతకు వారేమి చెబుతున్నారు. ఏముంది. మేము చెప్పిన వారికి ఓటేసి గెలిపిస్తే మీ సమస్యలు మొత్తం చిటికెలో మాయం. ఇంక మీకేల చింత అంటున్నారు. ఆ మాటలు నమ్మవచ్చా. భలేవాడివయ్యా నీకేల అనుమానం అంటున్నారయ్యా. అంటారులె ఈ నెల పదకొండో తేదీ తరువాత వారి అడ్రసు తెలియదు. వారి విచిత్ర వేషాలు, మాయమాటలకేముంది గాని అసలు అభ్యర్థుల గుణగణాలు వారు నిలబడ్డ పార్టీ మానిఫెస్టో, అలాగే గతంలో మానిఫెస్టో అమలుచేసిన తీరుతెన్నులు ఆలోచించాలిగ. అవన్నీ అందరికి తెలుసయ్యా. ఇప్పుడు సినిమా నిజం కాకపోయినా వంద రూపాయలు పెట్టి కాలక్షేపానికి చూస్తున్నాం గదా. ఇప్పుడు ఎన్నికల పుణ్యమా అని బుల్లి తెరపై వెండి తెరపై కాకుండ స్వయంగా రూపాయి ఖర్చు లేకుండా చూచి ఆనందించవచ్చు గదా. అంతేనంటావా. వారు చెప్పిన వారికి ఓటు వేయరంటావా. భలేవాడివయ్యా. నిలబడ్డవారు స్థానికులు వారి గురించి ఓటరుకు తెలియదనా. హైద్రాబాదు నుండి వచ్చి వారు చెప్పాలా. అభ్యర్థులకు కావలసిన సొమ్ము యిచ్చేవారు యిస్తున్నారు. వారు ఖర్చుచేసి ఈ వేషగాళ్లను రప్పిస్తున్నారు. ఇదంతా కాలక్షేపానికి. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసు. నిజమె. పోటీదారుల ఆత్మతృప్తికే గాని వేషగాళ్ల వల్ల ఓట్లు పడవని అందరికి తెలుసు. ఇదంతా ఒక జగన్నాటకం. అయినా ప్రజలకు ఏం కావాలో ఏ పార్టీ వారు తీరుస్తారో ప్రజలకు తెలుసు. ఇది మొదటిసారి ఎన్నికలు కావు కదా. అయినా నవ్వు వచ్చెదేమిటంటె బయటనుండి వచ్చినవారు చెప్పినంత మాత్రాన నమ్మి ఓటు వేయరని చెప్పేవారికి, చూసేవారికి తెలుసు. ఇదంతా ఆత్మతృప్తికే. అది సరె బావ అసలు ఏనాడు ఎండముఖం చూడని వారు భర్తల కోసం ఎండలో తిరుగుతున్నారు కదా. ఇదంతా ప్రజలకు సేవ చేయడానికేనా అని. అన్ని తెలిసి అడుగుతావేంటయ్యా. ఇపుడు ప్రచారం చేసే నారీమణులు గతంలో ప్రజలకోసం ఏనాడైనా వచ్చారా చెప్పు. ప్రజాసేవ కాదయ్యా ఉన్నది చాలక స్వసేవలో సంపాదన కోసం. అంతేకాదు వచ్చిన వారికి నియోజక సరిహద్దులు కూడ తెలియవు. ఏది ఏమైనా భర్తల కోసం భార్యలు పడే అవస్ధ చూడలేకపోతున్నామయ్యా. చూడు బావ ఒకడు వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం సెట్టి విజయవాడ వచ్చి నీ బాధ నాది అని శ్రీశ్రీలాగ చెబుతున్నాడు. ఇదంతా పదవి, సంపాదన కోసమె. అవునా, నిజమా అని నోరు తెరుస్తావేంటయ్యా. పచ్చి నిజం.
సెల్‌:9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img