Free Porn

manotobet

takbet
betcart
betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Thursday, June 20, 2024
Thursday, June 20, 2024

ఏది నీతి… ఏది నేతి…!?

‘‘ఏం బావ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్‌’’ అన్నాడు వెంకట్రావ్‌. ఆ సమయంలో బావ అనే పాపారావు ఆకాశం వైపు కాస్త కంగారుగా, చికాకుగా, ఆందోళనగా చూస్తున్నాడు. ఇలా అడుగుతూనే వెంటనే సమాధానం చెప్పేస్తాడేమోననే భయంతో మళ్లీ వెంకట్రావే ‘‘బావా…ఇంటి పై కప్పులు దేంతో వేద్దామా అని పాత చింతకాయ పచ్చడి జోకు చెప్పకు. నాకు కాలుతుంది’’ అని కూడా అన్నాడు. ‘‘ఏం లేదు బావా… ఈ మధ్య సిద్ధాంతం అంటూ అందరూ తెగ మాట్లాడుతున్నారు. అదేంటో అర్ధం కావడం లేదు. నా బండబుద్ధికే ఇలా ఉందా… మొత్తం లోకమంతా ఇలాగే ఉందా అనిపిస్తోంది’’ అన్నాడు పాపారావు. ‘‘ ఓరి నీ పాసికూల. ఈ మాత్రానికే ఇలా అయిపోయావా. సిద్ధాంతం అంటే ఏం లేదు. పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఊరు’’ అని పాపారావు పక్కనే సిగరెట్‌ వెలిగించుకుంటూ కూర్చున్నాడు వెంకట్రావ్‌. ‘‘ఆ మాత్రం నాకు తెలీదనుకున్నావా. దాని గురించి కాదు నేనడిగింది ‘‘ అని కాస్త చిరాకుగా చెప్పాడు పాపారావు. ‘‘ ఓ అదా….. అలా సిరాకు పడిపోతావేటి. ఇప్పుడు రావులపాలెం ఉందా… ఉంది కదా… అక్కడి నుంచి కనకదురగమ్మను చూసేందుకు ఇజియవాడ వెళ్లే అయివే ఉంది కదా. ఆ అయివే మీదుగా వస్తే గోదారొస్తుంది. విప్పుడు విసుక తప్ప నీళ్లు లేవనకుకో. దాని మీద బిడిజి ఉంది కదా. దాన్నే సిద్ధాంతం బిడిజి అంటారు’’ అని వివరించాడు వెంకట్రావ్‌. ‘‘ఉస్సో… నీకు ఈమధ్య ఎటకారం ఎక్కువై పోయింది బావ. అదీ కాదని నీకు తెలుసు. ఎటకారం. ఎటకారం కావాలి నీకు. అందుకే. తెలుసున్నా చెప్పడం లేదు’’ కాస్త కోపంగానే అన్నాడు పాపారావు. ‘‘పైరైపోకు బావా. కోపంలో నీ ముఖం బాగుంటుందని అలా మాట్లాడాను. చెప్పు దేని గురించి నీ తాపత్రయం’’ కాస్త శాంతంగానే సమాధానం చెప్పాడు వెంకట్రావ్‌. ‘‘అదే బావా. పత్రికల్లో మా సిద్ధాంతం అది, మా సిద్ధాంతం ఇది. వారి సిద్ధాంతంలా కాదు మేం అని మాట్లాడుతున్నారు కదా. దాని గురించి బావా నేనేడిగేది’’ ‘‘అదా. ప్రతి రాజకీయ పార్టీకి ఓ సిద్ధాంతం ఉంటుంది. అంటే అది వారి మార్గం అన్న మాట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఆ పార్టీలో చేరిన వారు ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారన్న మాట. అంతే కాదు ఇతర పార్టీల సిద్ధాంతాలపై విరుచుకుపడతారు’’ కాస్త వివరంగానే చెప్పడానికి ప్రయత్నించాడు వెంకట్రావ్‌. ‘‘అంటే ఆ సిద్ధాంతాలను నమ్మిన వారు చిరకాలం ఆ సిద్ధాంతాలకే కట్టుబడి ఉండాలన్న మాట. ఎదుటి వారి సిద్ధాంతాల పట్ల వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లు చివరకంటా అలాగే మాట్లాడాలన్న మాట’’ అన్నాడు పాపారావు. ‘‘మరింకేంటీ. ఇంతే కదా. నీకు రెండు చెవుల మధ్య ఏమి లేదని కొందరంటారు కాని బావా. ఉంది. నీకు బుర్రుంది’’ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చెప్పాడు వెంకట్రావ్‌. ఈ రెండు చెవుల మధ్య ఏమీ లేదన్న మాటని పాపారావు విన్నాడో లేక అర్ధం కాలేదో కానీ ‘‘ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నింటికి ఏదో ఒక సిద్ధాంతం ఉంది కదా. మరి ఎదుటి పార్టీ వాళ్లతో కలిసిపోవడం, ఆళ్ల మనుషులకు ఈళ్లూ, ఈళ్ల మనుషులకి ఆళ్లు టిక్కట్లు ఇచ్చేసుకోవడం ఏ సిద్ధాంతం బావా’’ కాసింత ఆగ్రహంగానే అడిగాడు పాపారావు.‘‘బావోయ్‌. నీకు సాలా ఇసయాలు తెలిసిపోతున్నాయి. ఇన్ని చెబుతున్నావ్‌ కదా… ఎక్కడేం జరిగిందో నువ్వే చెప్పు’’ అన్నాడు వెంకట్రావ్‌. పాపారావు తన పక్కనే ఉన్న మరచెంబులో నీళ్లు నేరుగా గొంతులో పోసుకుని గడగడ మింగేశాడు. ఆ తర్వాత సావకాశంగా ‘‘ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఉంది. అది జాతీయత పేరుతో వచ్చిన పార్టీ. తెలుగోళ్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసారని, తీస్తున్నారని అన్న ఎన్‌టిరామారావు గారు ఏం చేశారు. అహ. ఏం చేశారు. ఏకంగా ఓ పార్టీ పెట్టేశారు కదా. అప్పటికే దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కి తెలుగు రాష్ట్రాల్లో పారుతున్న అన్ని నదుల నీళ్లు తాగించేశారు కదా. అవునా… కాదా… ‘‘ఇలా అడుగుతున్నప్పుడు పాపారావు గుండెలు అతనికి తెలియకుండానే ఉప్పొంగాయి. ఆ గుండెలు చూసిన వెంకట్రావ్‌ ‘‘అమ్మో… మనం తక్కువ మాట్లాడాలి. మళ్లీ మనల్ని ఈడు గుండెలు తీసిన బంటు అని ప్రచారం చేస్తాడు’’ అని మనసులో అనుకున్నాడు. పైకి మాత్రం ‘‘నిజమే కదా… ఇప్పుడేమైంది’’ అన్నాడు. ‘‘ఏమైంది అని మెల్లిగా అంటావేంటి. అన్నగారి నుంచి పార్టీ లాక్కున్న చం.బా.యుడు ఏం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసిపోయారు. ఎంత అవమానం అది. ఎంత తలవొంపులు అలా చేయడం’’ అన్నాడు. అతని మాటకి అడ్డొచ్చిన వెంకట్రావ్‌ ‘‘చం.బా.యుడు అక్కడ అలా చేశారు కాబట్టే అక్కడ దెబ్బ తినేసారు’’ అన్నాడు. ‘‘అక్కడ చేశారు సరే. మరి ఇక్కడేం చేశారని అడగవేంటి బావా నువ్వు’’ అన్నాడు పాపారావు. ‘‘అడగడం ఎందుకు. చెప్తున్నావ్‌ కదా. చెప్పు’’ కాస్త చికాకుగా అన్నాడు. అలా చికాకుగా ఉండడానికి కారణం వెంకట్రావ్‌ ఆ టైంలో పచ్చ చొక్కా వేసుకున్నాడు.‘‘కాషాయం పార్టీ ఉంది. అది ఎప్పటి నుంచో ఓ మతానికి మద్దుతు ఇచ్చే పార్టీ. దాంతో మనకేం సంబంధం లేదు. కానీ కోపం మాత్రం ఉంది కదా… రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో తెలంగాణాకి మద్దతు ఇచ్చారని… అవునా… కాదా..’’ ఎందుకైనా మంచిదని బావకి కాసింత దూరం జరిగిన వెంకట్రావ్‌ ‘‘ఉంది. కోపం ఉంది’’ అన్నాడు. ‘‘ఇంతకు ముందు అధికారంలో ఉన్న ఐదేళ్లూ కమలనాధుల్ని నానా తిట్లు తిట్టిన చం.బా.యుడు ఇప్పుడు మళ్లీ ఆళ్లతో కలవడాన్ని ఏ సిద్ధాంతం అంటారు బావా. ఈయనకి తోడు అంపోలు ఎంకనొకడు అన్నట్లు ఆ పీకే ఒకడు. పాచిపోయిన లడ్లు, వాచి పోయిన ముఖాలు అంటూ తిట్టి మళ్లీ కమలాన్ని కౌగలించుకుంటున్నారు. ఏటీ సిద్ధాంతాలు’’ మండిపడ్డాడు పాపారావు. తాను కూడా ఏదో ఒకటి మాట్లాడకపోతే తనకు ఏం తెలియదనుకునే ప్రమాదం ఉందనుకున్న వెంకట్రావ్‌ ‘‘ ఈళ్లు సరే, మరి ఆళ్లని మతతత్వ పార్టీ అని, మరొకటని తిట్టిన వాళ్లతో సీట్లు షేరింగే కాదు… శాలువాలు కప్పుకుని మరీ సీట్ల త్యాగం చేసేస్తున్నారు’’ అన్నాడు. తాను పచ్చ చొక్కా వేసుకున్నానన్న విషయం గుర్తొచ్చి ‘‘మరి ఫ్యాను కూడా పసుపు చొక్కా ఇప్పేసి ఫ్యానట్టుకుని వచ్చినోళ్లకు టిక్కట్‌ ఇచ్చేసిందిగా’’ అన్నాడు. ‘‘అదే బావా నేననేది. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు.. అవి బూటకం… ఎన్నికల ముందు పెద్ద నాటకం’’ అన్నాడు పాపారావు. కాస్త దూరంగా రేడియోలోంచి ‘‘తెలిసేట్టు చెప్పేది సిద్ధాంతం. అది తెలియకపోతేనే వేదాంతం’’ అని పాట వస్తోంది. సెల్‌ : 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img