Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఓట్లపై నోట్ల పడగ

మోదుమూడి మురళీకృష్ణ

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో లోక్‌సభ స్థానంలో రూ.100 కోట్లు …అసెంబ్లీ స్థానంలో రూ.15 కోట్లుపైన ఖర్చు చేయగలిగే బిగ్‌షాట్‌లనే ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులుగా బరిలోకి దించాయి. ఇన్ని కోట్లు దేనికి? ఎవరిని ప్రలోభపెట్టటానికి? కచ్చితంగా ఓటర్లే లక్ష్యం. నోటుకు ఓటు కొనుగోలే ధ్యేయం. ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం పోకడ విపరీత స్థాయికి చేరింది. నోట్ల రద్దు… దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తే.. నల్లధనం వెలికి తీయటానికే ఈ సంస్కరణలంటూ అధికార పార్టీ ఇప్పటికీ వెకిలిగా సమాధానం ఇస్తోంది. మరి ఇప్పుడు ఎన్నికల్లో ప్రవహిస్తున్న ఈ ధనం మాటేంటీ? తెల్లధనంగా మారిన నల్లధనం కాదా ?
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. ఇందులో నగదు (రూ.849.15 కోట్లు), మద్యం (రూ.814.85 కోట్లు), మాదకద్రవ్యాలు (రూ.3,958.85 కోట్లు), విలువైన లోహాలు (రూ.1,260.33 కోట్లు), ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన ఉచితాలు (రూ.2,006 కోట్లు) ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తెలిపింది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా లెక్కలేనంత డబ్బు సంచుల్ని తరలిస్తున్నాయి. ఆఖరికి ఆంబులెన్స్‌లు, ఆర్టీసీ బస్సుల్లోనూ నోట్ల కట్టల్ని తరలిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మూడోసారి అధికారం కట్టబెట్టాలంటూ ఓట్లు అడుగుతున్న మోదీగానీ, బీజేపీ గానీ పైసా ఖర్చు చేయకుండా రాజకీయం చేయలేని పరిస్థితి. దేశంలో ఎన్నికలు ప్రచారాలకు బ్లాక్‌ మనీయే ఇం‘ధనం’గా మారిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కొన్ని పార్టీలు బహుమతులతో ఊరిస్తున్నాయి. నల్లధనం, ఇతర అక్రమ ప్రలోభాలను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా వేల మంది పరిశీలకులు, పర్యవేక్షణ బృందాలను నియమించినప్పటికీ అభ్యర్థులు గోనెసంచుల్లో నోట్ల కట్టలను తరలిస్తూనే ఉన్నారు.
నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకే పెద్ద నోట్లను రద్దు చేసినట్టు, ఎన్నికల బాండ్లను తీసుకువచ్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొస్తున్నా… లోక్‌సభ ఎన్నికల్లో నల్లధనం పరవళ్లు తొక్కుతోంది. గత 79 రోజుల్లో దేశవ్యాప్తంగా దొరికిన లెక్కలేని నగదు… మోదీని వెక్కిరిస్తోంది. మార్చి 1 నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తులో 45శాతం (రూ.3,958 కోట్లు) డ్రగ్స్‌ ఉన్నట్లు ఈసీ తెలిపింది. పట్టుబడిన మొత్తం సొత్తులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.301.75 కోట్లు, తెలంగాణ నుంచి రూ.333.55 కోట్లు ఉన్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా అత్యధిక సొత్తు దొరికిన రాష్ట్రాల్లో తెలంగాణ 10, ఏపీ 12వ స్థానంలో నిలిచాయి. ఏపీలో 85.32 కోట్ల నగదు, రూ.43.17 కోట్ల విలువైన మద్యం, రూ.5.70 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.142.56 కోట్ల విలువైన నగలు, పంపిణీకి సిద్ధం చేసిన రూ.25.01 కోట్ల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో 114.41 కోట్ల నగదు, రూ.76.26 కోట్ల విలువైన మద్యం, రూ.29.31 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.77.23 కోట్ల విలువైన నగలు, రూ.36.34 కోట్ల విలువైన ఉచితాలు దొరికాయి. అత్యధిక నగదు తెలంగాణ (రూ.114.41 కోట్లు)లో, అత్యధిక డ్రగ్స్‌ గుజరాత్‌ (రూ.1,187 కోట్లు)లో పట్టుబడ్డాయి. నగదు, మద్యంతో ఓట్లను కొనుగోలు చేసి విజయం సాధించాలన్నదే ధ్యేయంగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టికెట్‌ పొందడం నుంచి పోలింగ్‌ వరకూ అభ్యర్థులు పెద్ద ఎత్తున నగదు ఖర్చు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శక చర్యలు ఏమైనా చేపట్టిందా అంటే అది ప్రశ్నగానే మిగిలిపోయింది.
వ్యయ పరిమితి…వెలవెల
అధికారికంగా భారతదేశంలో ఎన్నికల వ్యయంపై పరిమితి ఉంది. లోక్‌సభ అభ్యర్థులకు రూ.75 లక్షల నుంచి 95 లక్షల వరకు, అసెంబ్లీ అభ్యర్థులకు రూ.28 లక్షల నుంచి 40 లక్షల వరకు పరిమితి విధించారు. ఆచరణలో మాత్రం అభ్యర్థులు నివేదించిన ఖర్చుల వ్యయం ‘ అభ్యర్థుల వాస్తవ వ్యయాలకన్నా అతి తక్కువ మాత్రమే సూచిస్తున్నారని, తరచూ మొత్తంలో 1/30 లేదా 1/50 కన్నా తక్కువగా ఉంటుందని’ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రకటనల ఏజెన్సీలు, రాజకీయ కన్సల్టెంట్లు, జాతీయ పార్టీల కోసం దేశవ్యాప్తంగా ప్రచార సమూహాలు, ఖరీదైన ప్రింట్‌, ప్రసారాలు, ఇంటింటికీ సందేశాన్ని అందించేందుకు ఆన్‌లైన్‌ ప్రకటన ప్రచార సాధనాలుగా ఉన్నాయి. ఇక రాజకీయ పార్టీల ప్రచార గ్రంథాలయాలుగా గూగుల్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా ఒక్కొక్క పార్టీ ఆన్‌లైన్‌ ప్రచారానికి భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టింది. ఈ ప్రచారాలను నిలువరించడానికి ఎన్నికల సంఘానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు ఎన్నికల కమిషన్‌ అసాధారణ నిబంధనల్లో ఒకటేమిటంటే, అభ్యర్థుల ఖర్చుకు పరిమితి ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలకు వ్యయం విషయంలో గరిష్ట పరిమితి లేదు. పార్టీలు ఎంత ఖర్చు చేస్తున్నాయో, ఈ డబ్బును ఎక్కడి నుంచి పొందుతున్నాయో మాత్రమే చెబుతాయి. ఆ వివరాలు అందజేయడంలో తరచూ జాప్యం చేస్తుంటాయి. ఓటర్ల మనస్సును గెలవడానికి ఎంత ఖర్చవుతుందనే విషయంలో అంచనాలో రాజకీయ నాయకులు ఒక అడుగు ముందే ఉన్నారు. ‘గత ఎన్నికల్లో నేను పోటీ చేద్దామనుకున్నా. ఒక పరిశీలన కూడా చేశా. ఒక ఓటు రేటు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంది. ఇక విందులకు చేసే ఖర్చు రూ.50 వేలకంటే ఎక్కువగా ఉంది. ఖర్చు మొత్తంగా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లకు చేరింది. అది తలకుమించిన భారంగా ఉండటంతో నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా’ అని ఒక రాజకీయ నాయకుడు పేర్కొన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది.
2017లో ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ ఉన్నప్పుడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ, నోట్ల రద్దు తర్వాత రాజకీయ నిధుల ప్రక్షాళన కూడా జరిగిందని చెప్పుకొచ్చారు. ‘70 ఏళ్ల స్వాతంత్య్రం అనంతరం కూడా ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరిగేందుకు కీలక వ్యవస్థ దేశంలోని రాజకీయ పార్టీల నిధుల సమీకరణ పద్ధతిని పారదర్శకంగా రూపొందించలేకపోయాయి’ అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నిధుల విషయంలో గొప్ప పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు ఎన్నికల బాండ్లు అనే ఒక కొత్త సాధనాన్ని జైట్లీ ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న తేల్చేసింది. ఈ బాండ్లు ప్రవేశ పెట్టిన కొద్ది రోజులకే వీటిని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు జయా ఠాకూర్‌, సీపీఎం, స్వచ్ఛంద సంస్థ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ విచారణ జరుగుతున్న సమయంలోనే గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎదురు బెదురు లేకుండా మరోసారి ఎన్నికల బాండ్లు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు అందే విరాళాలలో దాపరికం ఉండకూడదన్న మిషతో ప్రవేశ పెట్టిన ఈ బాండ్లలో ఉన్నదే దాపరికం. భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ) అమ్మే ఈ బాండ్లను ఎంత మొత్తానికి ఎవరు కొన్నారన్న విషయం తెలియకుండా ఉండడం ఈ బాండ్లలో ఉన్న వికృత వ్యవహారం. ఎంత మొత్తానికి బాండ్లు కొనాలి అన్న విషయంలోనూ పరిమితి లేదు. ఈ వివరాలు తెలిసేది ఆ బాండ్లు విక్రయించిన ఎస్‌బీఐకి మాత్రమే. ఆ బ్యాంకుకు తెలిసిందంటే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తెలుసుకోవడం పెద్ద పనికాదు. ఈ గుప్త విరాళాలు బీజేపీ ఖజానాలోకే అత్యధికంగా చేరడం చూస్తే వీటిని ప్రవేశ పెట్టడంలో మర్మం ఏమిటో అర్థమై పోతుంది. 2017-18 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో బాండ్ల రూపంలో రూ.12,008 కోట్లు సమకూరితే అందులో బీజేపీకి సమకూరిన మొత్తం రూ.6,564 కోట్లు. అంటే 55 శాతం విరాళాలు బీజేపీకే అందాయి. కాంగ్రెస్‌కు కేవలం రూ.1,135 కోట్లు అందాయి. అంటే 9.5 శాతం మాత్రమే. ప్రాంతీయ పార్టీలకు దండిగానే బాండ్ల రూపంలో విరాళాలు ముట్టాయి. ఎన్నికల బాండ్ల రూపంలో తామెటువంటి విరాళాలు తీసుకోలేదనీ, తీసుకోబోమని సీపీఐ, సీపీఎం స్పష్టం చేశాయి. ‘ధన శక్తిని విచ్ఛిన్నం చేయడానికి, ఎన్నికలలో ప్రజా నిధుల అవకాశాలను అన్వేషించటం మంచిది’ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img