Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

గోదాముల్లో ఆహార నిల్వలు ఆకలి కేకల్లో పేదలు

ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార ఉత్పత్తిలో మన దేశం రెండవ స్థానంలో ఉండడం ఒకవైపు, పోషకాహారలోపంలో అగ్రస్థానంలో ఉంటూనే ఆకలి కేకల్లో భారత్‌ తొలి స్థానంలో నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా బియ్యం, గోధుమలు, చక్కర, పల్లికాయ, కూరగాయలు, పండ్లు, చేపల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రమేణా పెరిగినా, అదే క్రమంలో ఆకలి కూడా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. 2021 అంచనాల ప్రకారం, ప్రపంచ జనాభాలో 10శాతం పోషకాహారలోపంతో, 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరక్కపోవడం గమనించాలి. కరోనా వైరస్‌ విజృంభణతో అదనంగా 11.8 కోట్ల ప్రజలు ఆకలి కోరలలో చిక్కుకున్నారు. కరోన మహమ్మారి కల్లోల సమయంలో ప్రజాహార పంపిణీ వ్యవస్థల వైఫల్యం, నిరుద్యోగం పెరగడం, ధరలు పెరగడం, అసమానతలు పెరగడంతో పేదలకు రెండు పూటల ఆహారం అందని ద్రాక్షే అయ్యింది. 2022-23లో 330 మిలియన్‌ టన్నులు రికార్డ్డు స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగి (2021-22లో 316 మిలియన్‌ టన్నులు, 2020-21లో 311 మిలియన్‌ టన్నులు, 2019-20లో 298 మిలియన్‌ టన్నులు, 2018-19లో 285 మిలియన్‌ టన్నులు) భారత దేశం ఆహారధాన్యాలలో స్వయంసమృద్ధి స్థాయికి చేరినా, పోషకాహారలోపం 2018లో 13.8 శాతం ఉండగా, 2020లో 15.3 శాతం వరకు క్రమంగా పెరుగుతూనే ఉన్నది. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి అధికమై, మిగులు స్థాయికి చేరినప్పటికీ నిరుద్యోగం, పేదరిక ంతో కొనుగోలు సామర్థ్యం కొరవడిన కారణంగా పోషకాహార లోపం, ఆకలి చావులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో దాదాపు 14 శాతం (అనగా 190 మిలియన్లు) ప్రజలు పోషకాహార లోపంతో, 20 శాతం 5-ఏండ్ల లోపు పిల్లలు తక్కువ బరువుతో, 35 శాతం పిల్లలు గిడసబారిన ఎదుగుదల, 52 శాతం 15-49 ఏండ్లలోపు మహిళలు రక్తహీనతతో సతమతం అవుతున్నారు.
అట్టడుగున ఆకలి సూచి
గ్లోబల్‌ హంగర్‌ సూచి -2023 వివరాల ప్రకారం 125 దేశాల్లో ఆకలి సూచికలో భారతదేశ స్థానం అట్టడుగున 111వ స్థానంలో ఉండడం విస్మయాన్ని కలిగిస్తున్నది. 2020లో ఇండియా స్థానం 94 కాగా, 2021లో 101వ స్థానం, 2022లో 107వ స్థానానికి దిగజారింది. దక్షిణ ఆసియాలోని పొరుగు దేశాల హంగర్‌ సూచికల స్థానాలతో పోల్చితే భారత్‌ వెనుకబడి ఉండడం విచారకరం. ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌, యఫ్‌ఏఓ) నిర్వచనం ప్రకారం ఆకలి సూచికలను గణించడానికి పోషకాహారలోపం, ఎత్తు కన్న తక్కువ బరువు ఉండడం, వయసు కన్న తక్కువ ఎత్తు ఉండడం, పిల్లల మరణాల రేటు 4 అంశాలు పరిగణలోకి తీసుకొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత కార్యక్రమం 1975లో ఇండియా సమగ్ర బాలల అభివృద్ధి సేవలను ప్రారంభించింది. భారత ప్రభుత్వం చేపట్టిన పోషణ్‌ అభియాన్‌, ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన, మద్యాహ్న భోజన పథకం లాంటి పథకాలలాంటివి ప్రవేశపెట్టారు. స్టంటింగ్‌, వేస్టింగ్‌, రక్తహీనత, తక్కువ బరువుగల శిశు జననాలను తగ్గించడానికి కృషి జరుగుతోంది. ఆహార భద్రత పథకంలో భాగంగా గర్భిణులు, పిల్లల తల్లులు, బాలలకు పోషకాహారం అందించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. పేదల కనీస అవసరాలు తీర్చడానికి ఆయుష్మాన్‌ భారత్‌, అంత్యోదయ, పీియం కిసాన్‌, స్వచ్ఛ భారత్‌, ఉజ్వల, 100 రోజుల పనికి ఆహారపథకం లాంటివి కూడా ప్రజలకు దోహదపడుతున్నాయి. ఆహారధాన్యాల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, మిగులు నిల్వలు ఉన్నాయని సగర్వంగా చెప్పుకున్నప్పటికీ, పేదల కడుపుల్లో ఆకలి కేకలు వినపడడం ఆశ్చర్యాన్ని, ఆవేదనని కలిగిస్తున్నది. ఆహార నిల్వలు గోదాముల్లో పందికొక్కుల పాలు కావడంతో పాటు మురికివాడల్లో/గ్రామీణ నిరుపేదల కుటుంబాల కడుపుల్లో ఎలుకలు పరుగెడుతున్నాయి.మన దేశం స్థూలకాయం ఓ వైపున, బక్కచిక్కిన అస్థిపంజర అభాగ్య పేదలు మరోవైపు పెద్ద సమస్యగా నిలుస్తున్నారు. ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం పెంచడానికి ఉద్యోగ ఉపాధుల కల్పన, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు, విద్య వసతుల కల్పన, లింగ సమానత్వ చర్యలు, జనాభా నియంత్రణ లాంటివి జరిగినప్పుడు అసమానతలు తొలగిపోయి అందరికీ పోషకాహారం అందుబాటులోకి వస్తుంది.

డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
ఫోన్‌: 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img