Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

జార్ఖండ్‌లో బీజేపీకి ఎదురుగాలి

డా. జ్ఞాన్‌ పాఠక్‌

జార్ఖండ్‌లో ఈసారి ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నష్టం జరిగి కాంగ్రెస్‌ ప్రయోజనం పొందనుంది. తమ ప్రభుత్వం అహారధాన్యాలను, ఇళ్లను, ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించిందని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలలో వీరి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలోఉన్న జార్గ గ్రామస్థులు తమ గ్రామానికి మరోసారి రావద్దని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం రాంచి జిల్లాలోని బ్లాకు ప్రధాన పట్టణం అంగారాకు 25కిలోమీటర్ల దూరంలో ఉంది. రాంచికి అంగార నుంచి జార్గ గ్రామానికి, ఇతర అనేక గ్రామాలకు ఎలాంటి ప్రభుత్వ రవాణా సౌకర్యంలేదు. దీంతో వేలాదిప్రజలు అనేక భాదలకు గురవుతున్నారు. ఈ గ్రామాల ప్రజలకు వైద్య సౌకర్యాలు లేవు. తీవ్ర అనారోగ్యాలకు చికిత్స చేయించుకోవాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోండ్లి పొఖర్‌లో ఉన్న ఆస్పత్రికి వెళ్లాల్సిందే. కొన్ని తీవ్రమైన అనారోగ్య కేసుల్లో గోండ్లి పొఖర్‌కు వెళ్లేలోపే చనిపోతున్నారు. పేదరికం రవాణా సౌకర్యంలేక 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రాంచీకి వెళ్లాలనే ఆలోచనసైతం చేయడం లేదు. జార్ఖండ్‌లోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజల బాధలు ఇంతవరకు వెలుగులోకి రాలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ గిరిజన గ్రామాల్లో తమ భావజాలాన్ని ప్రచారం చేయడమే గానీ ప్రజలకు వైద్య సౌకర్యాలు, రవాణాలాంటివి కల్పించడానికి ప్రయత్నించకపోవడం ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అంగారలో మాత్రమే కొంత అభివృద్ధి జరిగింది. ఇందుకు అంగార అధికారులు, జాతీయ, అంతర్జాతీయ సహాయ బృందాలు, ఎన్‌జీఓలు కలిసి గిరిజన గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా రాంచికి తేలికగా వెళ్లగల సౌకర్యం కలిగింది. అయితే అభివృద్ధి ప్రాధమికస్థాయిలోనే ఉంది. అన్ని సీజన్లలోనూ అంగారబ్లాక్‌ నుంచి రెండు కిలోమీటర్ల దూరం సైతం వెళ్లే రోడ్ల సౌకర్యంలేదు. అంగార బ్లాక్‌ ఖర్జి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోఉంది. ఇప్పటికీ అంగారలో ప్రాధమిక అభివృద్ధి మాత్రమే జరిగింది. రాంచి లోక్‌సభ నియోజక వర్గంలో బీజేపీ చాలాసార్లు గెలిచింది. 2019 లోక్‌సభకు ఎన్నికలు జరిగిన తర్వాత కొన్ని నెలలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొద్దినెలల్లోనే ఖర్జి నియోజకవర్గంలో రాజకీయంగా చీలికలు ఏర్పడ్డాయి. ఈ ఎస్‌టి నియోజకవర్గంలో ఐఎన్‌సి అభ్యర్థి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తమకు ఎస్‌టి హోదా కల్పించాలని గిరిజనులు (మాహతోలు) డిమాండ్‌ చేస్తున్నారు. జార్ఖండ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీలు, క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎస్‌టిలలో రాజకీయం చొచ్చుకు పోయేందుకు కొంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీలు పనిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో గిరిజనులపై చర్చిలు మంచి పట్టుసాధించాయి. క్రైస్తవుల మిషనరీలకు రాంచి అతిపెద్ద కేంద్రం. 2019లో ఐఎన్‌సి (కాంగ్రెస్‌) అభ్యర్థిపై బీజేపీ 283029 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ 3, దాని మిత్రపార్టీ ఏజెఎస్‌యు ఒకసీటు, ఐఎన్‌సి, జెఎంఎం చెరోస్థానంలో గెలుపొందారు. తాజాగా ఈ గ్రామాల ప్రజలు క్రైస్తవ మిషనరీలు, లేదా ప్రతిపక్షాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. డబుల్‌ ఇంజిన్‌సర్కార్‌ మోదీ పట్ల విసిగివేసారి పోయామని గిరిజనులు చెప్తున్నారు. ఐదేళ్లుగా జెఎంఎం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిని మోదీ ప్రభుత్వం అరెస్టు చేయించిందని గిరిజనులు ఆగ్రహం ప్రకటిస్తు న్నారు. రాంచి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఇఛాఘర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జెఎంఎం గెలచింది. అంటే జెఎంఎం ప్రతిపక్ష కూటమి ఇండియాలో భాగమైంది. ఈ సారి రాంచి లోక్‌సభ నియోజక వర్గంలో బీజేపీ గెలుస్తుందన్న గ్యారంటీ లేదు. కాంగ్రెస్‌ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని అంచనా. తమకు ఎస్‌టి హోదా ఇవ్వలేదని గిరిజనులు మోదీపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలుండగా, బీజేపీ గత ఎన్నికల్లో 11సీట్లు గెలుచుకుంది. ఈసారి బీజేపీ 13 సీట్లలో పోటీ చేస్తోంది. ఇండియా కూటమిలో భాగస్వామి కాంగ్రెస్‌ ఏడు సీట్లలో, జెఎంఎం ఐదుసీట్లలో సీపీఐ(ఎంఎల్‌) ఎల్‌ ఒకటి, ఆర్‌జేడీ ఒక స్థానంలో పోటీచేస్తున్నాయి. బీజేపీకి మద్దతు గణనీయంగా తగ్గిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 50.96శాతం ఓట్లు లభించాయి. అయితే ఆ తర్వాత కొద్దినెలల్లో జరిగిన శాసనసభ ఓట్లు 33.37శాతానికి పడిపోయింది. అంతకుముందు బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు జేవీఎం నాయకుడిగా బాబుమరిండి వచ్చి చేరినప్పటికీ బీజేపీ పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. జార్ఖండ్‌లో మొదటి దశ ఎన్నికలు మే 13వ తేదీన జరిగాయి. నాలుగవ దశలో నాలుగు స్థానాలలోసింగ్‌భమ్‌, ఖుంతి, దోహర్‌దగా, పాలమూర్‌, పాలము నియోజక వర్గాలలో జరిగాయి. అయితే ఈ నాలుగింటిలో పాలములో మాత్రమే బీజేపీకి కొంచం ఆధిక్యత ఉండవచ్చునని చెబుతున్నారు. తక్కిన మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ ఆధిక్యతలో ఉందని అంచనా వేశారు. ఈ మూడు సీట్లు`ఛత్ర, కొడర్మ, హజారిబాగ్‌లో మే 20న ఎన్నికలు జరిగాయి. కొడర్మ స్థానాన్ని గతంలో బీజేపీ గెలుచుకున్నప్పటికీ ఈ సారి దాన్నినిలుపుకోవడం కష్టమేనని అంచనా ఉంది. ఛత్ర, హజార్‌బాగ్‌లలో కాంగ్రెస్‌ బీజేపీ అభ్యర్థులకు కునుకులేకుండా చేస్తోంది. గిరిధి స్థానంలో జెఎంఎం అభ్యర్థిపైన ఏజేఎస్‌యు పోటీ చేస్తోంది. ఈ స్థానంలో మే 25న ఎన్నికలు జరుగుతాయి. మరో మూడు నియోజకవర్గాలు ధన్‌ఘడ్‌, రాంచి, జంషడ్‌పూర్‌లలో కూడా ఇదే తేదీన ఎన్నికలు జరుగుతాయి. ధన్‌ఘడ్‌లో మాత్రమే బీజేపీకి అవకాశాలు ఉంటాయని గిరిధ్‌, జంషడ్‌పూర్‌లలో జెఎంఎంపైన రాంచిలో కాంగ్రెస ్‌పైన పోటీ చేయనుంది. రాజ్‌మహల్‌, దుంకా, గొడ్డ నియోజకవర్గాలలో జూన్‌ 1న ఎన్నికలు జరుగుతాయి. రాజ్‌మహల్‌లో బీజేపీకంటే జెఎంఎం బలంగా ఉంది. ఇండియాకూటమికి ఇదిసాను కూలమైన విషయం. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ తరువాతనే బీజేపీ, జెఎంఎం సీట్లు గెలుచు కుంటాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలు ఏబీవీపీ తదితర సంఘాలు ఓటర్లను చైతన్యపరచే శిబిరాలను ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీకే ఓటు చేయాలని నేరుగా ఓటర్లను కోరడంలేదు. వీరు పంపిణీ చేసే కరపత్రాల లోను నేరుగా బీజేపీకి లేదా నరేంద్రమోదీకి ఓటు చేయాలని విజ్ఞప్తి చేయడం లేదు. అందువల్ల కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్ఖండ్‌లో రాజకీయ పరిస్థితులు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img