Free Porn

manotobet

takbet
betcart
betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Thursday, June 20, 2024
Thursday, June 20, 2024

దళిత బిడ్డలంటే లోకువా

కరవది సుబ్బారావు

దళిత, గిరిజన బిడ్డలంటే ప్రభుత్వానికి లోకువగా ఉంది. వరుసగా రాష్ట్రంలో దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. దిశా చట్టం అంటూ ప్రచారంలో ఊదరగొట్టటం తప్ప ఎక్కడా ఆ చట్టాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేసిన దాఖలాలు లేవు. నిందితుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అయినప్పుడు మాత్రమే పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది గానీ అదే వ్యక్తి అగ్రవర్ణానికి చెందినవాడైతే మాత్రం వారికి ఏ చట్టాలూ వర్తించటం లేదంటే దళిత బిడ్డలపై ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపు ఇట్టే అర్థ్ధమవుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నడుస్తున్న బాటలోనే రాష్ట్రంలో జగన్‌ కూడా ఉన్నాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మంత్రి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజూ రోడ్డుపైన కుక్కలు అనేకం చస్తూ ఉంటాయి, అలా అని కుక్కల చావులన్నింటికీ మనం బాధ్యులం కాము కదా అన్న వ్యాఖ్యలు వారికి దళిత, గిరిజన బిడ్డలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంటే, రాష్ట్రంలో అటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ చేతలు మాత్రం అలాగే ఉన్నాయి. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే గుంటూరుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని రమ్యశ్రీ ఉదంతం ప్రభుత్వ పాలనా తీరును తేటతెల్లం చేస్తోంది. బాధితులకు న్యాయం చేయకపోగా వారికి అండగా ఉన్నవారిపైన పోలీసు జులుం ప్రదర్శించటం దేనికి సంకేతం? బాలిక ఉదంతంపై ముఖ్యమంత్రి కనీస వ్యాఖ్య చేయకపోవటం శోచనీయం. దళిత వర్గానికి చెందిన మహిళ రాష్ట్రంలో హోం మినిస్టర్‌గా ఉన్నప్పటికీ ఆయా వర్గానికి ఎటువంటి న్యాయం జరగకపోవటం, బాధిత కుటుంబానికి, బాధిత వర్గానికి ఎటువంటి భరోసా ఇవ్వకపోవటం మరింత దుర్మార్గం. అనంతపురంజిల్లాకు చెందిన బ్యాంకు ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేసే స్నేహలత అనే దళితబాలిక డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెపై అత్యాచారం చేయటమే కాకుండా హత్య చేశారు. ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. రెండు నెలల క్రితం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో నిశ్చితార్థం జరిగి షికారుకు వచ్చినజంటపై దాడిచేసి అబ్బాయినిబంధించి అమ్మాయిపై అత్యాచారం చేసిన ఘటనలో ఇద్దరి నిందితులలో ఒకరిని అరెస్టు చేసినప్పటికీ, మరోవ్యక్తిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేకపోవటం ప్రభుత్వ చేతగానితనాన్ని, నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. దాదాపు ఏడాది క్రితం షూ సెంటర్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 4 రోజుల పాటు పది మంది యువకులు బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రభుత్వం నిందితులను అరెస్టు చేసినప్పటికీ బాధిత కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు. ఆ అరెస్టులు కూడా కేవలం దళిత సంఘాలు చేపట్టిన ఉద్యమం ఒత్తిడి మేరకే జరుగుతున్నాయి. దళిత మహిళతో దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కనిగిరి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు నిందితుడిని కేవలం స్టేషన్‌ బెయిల్‌పై బయటకు పంపటంతో నిందితుడు బాధిత కుటుంబం ఎదుటేరోజూ కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతుండటం దేనిని సూచిస్తుందో? కర్నూల్‌ జిల్లాకు చెందిన దళిత ఫిజియోథెరపిస్టు కులాంతర వివాహం చేసుకున్నందుకు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇప్పటి వరకు పురోగతి లేకపోవటం, బాధిత కుటుంబానికి ఎవరూ అండగా లేకపోవటం దారుణం. విజయవాడకు చెందిన తేజస్వీనిని అమె ఇంటిలోనే తాను పెళ్లిచేసుకున్నానంటూ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేశాడు. కేసులో నిందితుడిని అరెస్టుచేసినప్పటికీ బాధిత కుటుంబానికి ఎటువంటి భరోసాలేని కారణంగా, ఆ కుటుంబం నేటికీ బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తోంది. ఇవి గత రెండు సంవత్సరాల కాలంలో జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవి. అత్యాచారం, హత్య కేసులు, దాడుల కేసులు ఇబ్బడిముబ్బడిగా నమోదు అవుతున్న ప్పటికీ ప్రభుత్వాలనుండి ఎటువంటి స్పందన లేకపోవటం, ఎటువంటి చర్యలు లేకపోవటం దళిత బడుగు బలహీన వర్గాల కుటుంబాలను భయకంపితులను చేస్తోంది. బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డలను చదువుకునేందుకు పంపించడానికి కూడా భయపడాల్సిన దుస్థితి నెలకొంది. అసలు తమకు న్యాయం జరగదు అనే అనుమానంతో చాలా కేసులు నమోదుకు కూడా నోచుకోవటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తన తీరును మార్చుకోవాలి. ప్రభుత్వం అంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాదు, కారాదు. అన్ని వర్గాలకు చెందిన ప్రభుత్వంగా పాలన సాగాలి. సమస్యలను రాజకీయ కోణంలో కాకుండా ఆయా వర్గానికి జరిగిన అన్యాయంగా గుర్తించాలి. దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు కూడా అదేదో వ్యక్తిగత ప్రయోజనాలతో కూడిన సమస్యలాకాకుండా తమవర్గానికి చెందిన అన్యాయంగా ఆలోచన సాగాలి. బడుగు బలహీనవర్గాలకు తాము అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలి. అందుకు బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగాఉండి, తమ సమస్యల పరిష్కారంకోసం, తమ హక్కుల సాధన కోసం, తమ చట్టాల అమలు కోసం నిత్యం పోరాడుతూనే ఉండాలి.
వ్యాస రచయిత దళిత హక్కుల పోరాట
సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img