Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ఎన్నికల ప్రచారం

సుశీల్‌ కుట్టి

ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ పక్కా ఓట్ల రాజకీయపార్టీ బడ్జెట్‌. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగడడానికి అవసరమైనంత సమయాన్ని ఆమె వెచ్చించారు. ఇది ఆమెకు ప్రస్తుత ప్రభుత్వంలో చివరి బడ్జెట్‌. నిర్మలా సీతారామన్‌, అమె బాస్‌ నరేంద్ర మోదీ పేద ప్రజలకు ఏదేదో చేస్తామని చెప్పారు. అయితే గడిచిన పదేళ్ల కాలంలో పేదల సంఖ్యను తగ్గించామని చెప్పుకుంటున్నప్పటికీ చేసింది ఏమీ లేదని ఆర్థిక నిపుణులు కేంద్ర గణాంకాలతో నిరూపించారు. ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పెద్దగా గుర్తించదగినది కాదని కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతూ తాము తిరిగి అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పగానే ప్రతిపక్ష సభ్యులు చిరునవ్వు నవ్వారు. నిర్మలా సీతారామన్‌ ఆమె ఆశ్రితుడైన మోదీ మరో రెండునెలల్లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోనున్నారు. ఈ ఎన్నికలకు తగినట్లుగా బడ్జెట్‌ను రూపకల్పనచేసి సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి సూచించన ప్రకారమే బడ్జెట్‌ను తయారుచేయడం సర్వసాధారణం. మోదీ పదేళ్లకాలంలో దేశాన్ని అభివృద్ధిచేశానని త్వరలో ప్రపంచంలో ఐదవ ఆర్థిక దేశంగా భారత్‌ను తయారు చేస్తామని చెప్పుకుంటున్నారు.
మోదీ ప్రచారం చేసినట్లుగానే ఆయన వందిమాగధులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో పన్నులలో ఏ మాత్రం మార్పులేదు. నిర్మల సీతారామన్‌ ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పొగిడారు. స్టార్టప్‌లకు, పెట్టుబడులకు ప్రయోజనం కల్పించేట్టుగా పనులను రూపొందించామని చెప్పుకున్నారు. దేశ సంపద, పెన్షన్‌ నిధులు మార్చి 25నాటికి పెరుగుతాయని అప్పుడు పర్యాటక రంగానికి ఎక్కువ పెట్టుబడులు పెడతామని ఆర్థికమంత్రి అన్నారు. మోదీ అనుచరులు లక్షద్వీప్‌లో పెట్టిన పెట్టుబడులను గురించి ప్రశంసించారు. మాల్దీవులు, అత్యంత సున్నితంగా ఉన్న లక్షద్వీప్‌లో పరిస్థితులను ప్రస్తావిస్తూ మోదీని సవాలుచేశారు. రానున్నకాలంలో అన్నివేళలా లక్షద్వీప్‌ దీవులు యాత్రికుల స్వర్గధామం అవుతాయని మంత్రి అన్నారు. అయితే వాస్తవంగా పర్యావరణం ధ్వంసం అవుతుందని అనేకమంది శాస్త్రవేత్తలు చెప్పారు. అయినప్పటికీ లక్షద్వీప్‌లో పెద్దపెద్ద హోటల్స్‌, భవనాలు నిర్మించి యాత్రికులను ఆకర్షించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా లక్షదీవుల పర్యావరణం తీవ్రంగా దెబ్బతిననుంది. ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసుల జీవనం దుర్బరం కానున్నది. అయినప్పటికీ ప్రధాని మోదీ మొండిగా దీవులన్నింటినీ నాశనం చేయడానికే పూనుకున్నారు. ఇంతకాలం ఆదివాసీలు పర్యావరణానికి ఏ మాత్రం హానిలేకుండా జీవిస్తూ వస్తున్నారు. మోదీ వీరి జీవనాన్ని పూర్తిగా మార్చివేయనున్నారు. ఎవరూ సలహా ఇచ్చినా ఆయన వినిపించుకోవడంలేదు.
శశిధరూర్‌ తనకు తోచిన నిర్వచనాన్ని చెప్పవచ్చు. అయితే నిర్మలా సీతారామన్‌ ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. జులైలో తిరిగి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షద్వీప్‌లో మోదీ ప్రభుత్వం ఎక్కువగా పెట్టుబడులు పెట్టగలదని ఆర్థిక మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని పెద్ద అభివృద్ధిచెందిన దేశంగా మోదీ తయారు చేస్తారని, పేదలు, మహిళలు, యువత రైతులను లక్ష్యంగా పెట్టుకుని వారిని అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. మా లక్ష్యాలు ఇవేనని కూడా మోదీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ నాలుగు విషయాలలో చేసిందేమీ లేకపోగా, రైతులను మరింతగా దెబ్బతీసేందుకు మూడు దుష్ట వ్యవసాయ చట్టాలను రూపొందించారు. రైతులు ఏడాదికిపైగా మహత్తర పోరాటాన్ని చేసిన తర్వాత ఎన్నికలలో గెలుపొందేందుకు వీలుగా చట్టాలను ఉపసంహరించుకున్నారు. కార్పొరేట్లకు సహాయపడేందుకు మాత్రమే చట్టాలను తీసుకొచ్చారు. రైతులు ఉద్యమాన్ని ఉపసంహరించుకునేందుకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీని ఇంతవరకు పరిష్కరించలేదు. భారతదేశంలో 80కోట్ల మందికి రకరకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారిని అభివృద్ధిపరచానని ఆర్థికమంత్రి మోదీని పొగిడారు. 80కోట్ల మంది అభివృద్ధిచెందిఉంటే, వారికి సంక్షేమ పథకాలు ఎందుకు చేశారు? మరోవైపు పేదరికం పూర్తిగా లేకుండా చేస్తానని ఇప్పటికీ 29శాతం పేదలు ఉండగా వారిని 11శాతానికి తగ్గించానని ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు.? ఇవన్నీ ఎన్నికలు పూర్తయిన తర్వాత పూర్తిగా మరచిపోతారు. ఆర్థికమంత్రి ఆరేళ్లుగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో 80కోట్ల మందికి ఆహారం, నివాసం కల్పిస్తున్నారని చెప్పారు. వీరందరికీ ఉచితంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నందున దేశంలో పేదరికమే ఉండకూడదు. అయినప్పటికీ ఎన్నికలప్పుడు చెప్పే పేదరికం నిర్మూలన ఆచరణలో జరగలేదు. పట్టణప్రాంత భారతదేశం తన ప్యాకెట్‌లో ఉన్నదని అందువల్లనే వేతన జీవులకు పన్నుల మినహాయింపు ఇవ్వలేదని మంత్రి చెప్పారు. పన్నులు చెల్లించేవారి నిధులు మంచి కార్యక్రమాలకు వినియోగిస్తామని అన్నారు.
పన్ను చెల్లింపుదారులు దాఖలుచేసే రిటర్న్‌లను తేలిక చేశామని ఆర్థికమంత్రి చెప్పారు. రిటర్న్‌ దాఖలు చేసేవారికి గతంలో 90రోజులు పట్టేదని, ఇప్పుడు 10రోజులు మాత్రమే సమయం పడుతుందని చెప్పారు. నిర్మలా సీతారామన్‌, నరేంద్ర మోదీ బీజేపీకి సానుకూలమైన వాతావరణాన్ని కలిగించి ప్రయోజనం పొందే చర్యలను తాత్కాలిక పద్దులో చేర్చారు. సమగ్ర జీడీపీపైన మోదీ ప్రభుత్వం శ్రద్ధపెట్టిందని మంత్రి అన్నారు. 2014 నుంచి గత పదేళ్లలో 250 మిలియన్ల (25 కోట్లు) ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పదేళ్లకాలంలో ఉచిత రేషన్‌ను 80కోట్లమందికి అందించడం వల్లనే 250 మిలియన్ల ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారని చెప్పారు. ఏడాదికి 6వేల రూపాయల సహాయాన్ని రైతులకు మూడు విడతలుగా అందిస్తున్నారు. వీరిని మరింతగా అత్యంత పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారని వీరికోసమే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చామని మంత్రి గొప్పలు చెప్పుకున్నారు. బడ్జెట్‌ వ్యవహారాన్ని మరచి రానున్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా మోదీ విజయం పొందుతారని ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఇవన్నీ మోదీ భక్తులు ప్రచారం చేస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఎంతో భిన్నంగా ఉంది. పిరమిడ్‌లో కింద ఉన్నట్లుగానే వీరు చెప్పే పేదల నిర్మూలన ఉందన శశిధరూర్‌ అన్నారు. ప్రశ్నించడానికి ఇచ్చిన అవకాశంలో పంటనష్టాల బీమా కనీసం 40 మిలియన్ల ప్రజలకైనా అందిందా? అలాగే ద్రవ్యోల్బణం ఏ మాత్రం తగ్గిందని శశిధరూర్‌ ప్రశ్నించారు. అంతేకాదు, ఆర్థికవృద్ధి పెరిగిందా? పన్నుల సంస్కరణలను ఇంకా విస్తరించారా? పన్నుల వసూళ్లు పెరిగాయా? అన్న ప్రశ్నలకు సీతారామన్‌ జవాబుఇస్తూ, మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడితే, ఆర్థికవృద్ధి అసాధారణంగా పెరుగుతుందని చెప్పారు. సవరణలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ‘వికసిత భారత్‌’ అనే పదాన్ని నిర్మలా సీతారామన్‌ అనేకసార్లు ప్రయోగించారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏంటో తెలియదుగాని, 2047నాటికి దేశం అభివృద్ధి చెందినదిగా మారుతుందని చెప్పుకున్నారు. కోటిమంది మహిళలను స్వయం సహకార గ్రూపుల ద్వారా సాధికారత కల్పిస్తామని చెప్పారు. అవసరమైనంత పరిమితిమేరకే ద్రవ్యలోటు ఉంటుందన్నారు. పన్నులలో మార్పులు చేయకుండానే మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించింది. లక్షదీవులను మాల్దీవులవలే రానున్న ఐదేళ్లలో అభివృద్ధి పరుస్తామని, ఏప్రిల్‌, మేలో జరిగే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి ఓటేయమని పార్లమెంటుని కూడా ఖాతరు చేయకుండా ఎన్నికల ప్రచారాన్ని చేశారు. బహుశ భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇలా పార్లమెంటులో ఎన్నికల ప్రచారం చేయడం ఏనాడూలేదు. చట్టసభలో ఎన్నికల ప్రచారం చేయరాదన్న నిబంధనలనుకూడా బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img