Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మోదీజీ ఇక చాలు

మోదీజీ ఇక చాలు యిక భరించలేమయ్యా ఇక చాలు ఇక చాలు. ఏమిటి బావ ఇక చాలు అంటున్నావు. మోదీ పాలనలో అన్ని సమకూరి స్వర్గసీమలా మోదీ కలలుగన్న రామరాజ్యం సిద్ధించింది. ప్రతి మనిషికి 15లక్షలు యిచ్చాడు అంబేద్కరు కోరుకున్న సమ సమాజం, రూలుతో కోరుకున్న ఆర్థిక సమానత్వం అన్ని సిద్ధింపచేసేడు. అందుకే ఇక చాలంటున్నాను. నిజమే గుజరాత్‌లో ముస్లింల ఊచకోత, మణిపూర్‌లో నగ్న ఊరేగింపులు, హరియాణాలో మతకల్లోలాలు వీటన్నిటిమీద ప్రశ్నించే హక్కు అన్నీ ఇచ్చాడు. కాని ప్రశ్నకు జవాబు మాత్రం చెప్పడు. ఆ మూడిరటితో ఆపావేంటయ్యా అయోధ్యలో మసీదుకూల్చి రామాలయం నిర్మిస్తున్నారు. అది ప్రారంభమైతే ఆయన ఇంట్లో కూర్చున్నా ఆ శ్రీరాముడే గీత రామరాజ్యంలో ఉన్న మంచిపాలన చేయిస్తాడు. అందుకేనా ఒక రాముడి వల్ల కాదేమోనని మరో రామాలయ నిర్మాణం అవసరాన్ని గుర్తించి కాశి సమీపంలోని మరో మసీదుపై సర్వే కోసం కోర్టు కెక్కారు. అక్కడ కూడా మశీదు అడుగున రామాలయం కన్పిస్తుంది. దాంతో రామాలయం కూల్చి మశీదు కట్టారు. కనుక మశీదు కూల్చి రామాలయం కడతామంటారు. ఆనవాళ్లకోసం వంద అడుగులు తవ్వినా అయోధ్య మశీదు అడుగున రామాలయం ఆనవాళ్లు కనపడలేదు. ఖంగారు పడకయ్యా ఇపుడు సర్వే రిపోర్టువచ్చాక మశీదు పడగొట్టిదాని అడుగున తప్పక రామాలయ ఆనవాళ్లు చూపుతారు.
అయినా బావ నాకు తెలియక అడుగుతాను ఉన్న మశీదును కూల్చి కట్టకపోతే రామాలయం నిర్మాణానికి స్థలం దొరకదా అని. అదంతా గతంలో నీలాగ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు వేరేచోట ఎంత స్థలం కావాలన్నా తీసుకోండి అయోధ్యలో మశీదు కూల్చి అక్కడే కట్టాలా అని అడిగారు. కాని గతంలో ముస్లింల పాలనలో రామాలయాలు పడగొట్టి ముస్లిం రాజులు మశీదులు నిర్మించారు కాబట్టి మేము ఇపుడు వాటిని పడగొట్టి రామాలయం కడితే తప్పేంటి అన్నారు. అదేంటి వాళ్లు తప్పుచేస్తే వీళ్లు తప్పుచేస్తే వీరు పవిత్రులెలా అవుతారు. మంచి కాదు ప్రతీకారం అంతే. అది సరే మూడు, నాల్గు రోజుల నుండి పార్లమెంటులో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా మోదీ నోరు విప్పడేంటి. వాయిదాలువేసి సభా సమయం వృధాచేసి, ప్రజలసొమ్ము నాశనం చేస్తున్నారుగ. మౌనమె నా భాష ఓ మూగ మనసా’’ అని గతంలో ఒక పాట. బాల మురళీకృష్ణ చాలా బాగా పాడారు బావ. బహుశా అది గుర్తుకొచ్చి మోదీ మౌనం వహించారనుకుంట. అయితే మౌనం అర్థ అంగీకారం అంటారు గదా. ఎమన్నా అనుకోండి నిజం చెప్పించలేరు అని మొండికేసి కూర్చున్నాడు. మొండివాడిని ఎవరూ ఏమీ చేయరుగ. అది సరే బావ ఈ పవన్‌ గోల ఏంటి. ఏముంది గతంలో సినిమాలు వినోదాత్మకంగా ఉంటే, ఇప్పుడు రాజకీయాలు వినోదాత్మకంగా తయారయ్యాయి. నా బాధ మీకేం తెలుసు. నేను పబ్లిక్‌లో మాట్లాడాలంటె ఎన్ని పుస్తకాలు రిఫర్‌ చేస్తున్నానో మీకు తెలియదు. వ్యవస్థ మారాలన్నా, పవర్‌లో ఉన్నా, పార్టీ మారాలన్నా కొంతమంది ప్రాణాలు వదలడానికి సిద్దపడాలి. ఈసారి ఎన్నికలలో గొడవలు జరుగుతాయి కనుక ప్రాణాలు వదలడానికి సిద్ధపడాలి. రోజుకు రెండు కోట్లు ఆదాయం వదులుకువచ్చా. నా యింట్లో సొమ్ము ఖర్చుపెడుతున్నా అలాగే మీరు ఖర్చు పెట్టండి ప్రాణాలు వదలడానికి సిద్ధపడకండని సైనికులకు మహోపదేశం చేస్తున్నాడు. అదా సంగతి, అందుకే 23 కాల్‌షీట్లు యిచ్చావు కాబట్టి రెండు కోట్లు చొప్పున 46 కోట్లకు పన్నుకట్టింది లేనిది దిల్లీ వెళ్లి తేలుస్తా అంటున్నాడు మంత్రి అంబటి. ఛీ ఛీ రాజకీయాలు ఇలా మారా ఏంటి బావ. గతంలో విమర్శలు ఎంతో హుందాగా ఉండేవి. అవి సద్విమర్శలు సమస్యలపై విమర్శలు. ఇప్పుడు వ్యక్తిగత విమర్శ లెక్కువ. ఇంట్లో ఆడవాళ్లను బజారు కీడుస్తున్నారు. వీరి వల్ల మహాసాధ్వి పతితగా మారుతోంది. అది సరే వీళ్ల నోటికి తాళం పడదా! ఏం పడుతుంది మనది ప్రజాస్వామ్య దేశం కదా అందుకే కోర్టులు కూడా ఆపలేకపోతున్నాయి. అది సరే చంద్రబాబు పర్యటనలో పోలీసుల దెబ్బలు తిన్నారేంటి. వయసు, రాజకీయ హుందాతనం మరిచి చంద్రబాబు మాట్లాడుతుంటే స్థానికులు ఊరుకోరు. మరి పోలీసులు ప్రభుత్వానికి తొత్తులు అంటారు. మరల వైసీపీ వారే పోలీసుల్ని కొట్టారంటాడు. పోలీసు అధికారులు వీడి ద్వారా ఎవరైనది తేల్చి కఠినంగా శిక్షిస్తామంటారు. అయినా దెబ్బతిన్న పోలీసులు ఎన్నికల రోజు వారి ప్రతాపం చూపిస్తారు. పవన్‌, చంద్రబాబు ప్రసంగాలు వారికే నష్టం చేకూర్చేలా ఉన్నాయని కొందరు విశ్లేషకుల భావన. మరి అందుకేగా మోదీ మౌనరాగం అందుకున్నారు. అయినా ఒక్క మణిపూర్‌లోనే ఘర్షణలు ఆపలేని కేంద్రం దిగిపోవడం మంచిదని కూడా పెద్దలంటున్నారు. అందుకే మోదీజీ ఇక చాలు అంటున్నారు ప్రజలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img