Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మోసగాళ్లకు మోసగాడు

చింతపట్ల సుదర్శన్‌

ఎండ రేగుచెట్టు ముళ్లలా గుచ్చుకుంటున్నది. మాంసం కొట్టు ముందు ‘వెయిట్‌’ చేస్తున్న డాగీకి షాపు లోనుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నడిచిపోతున్న మనిషి చేతి సంచిలోంచి ఏదో జారి కిందపడ్డది. ఎండలో కెంపులా మెరుస్తున్న అది ఏమిటో అర్థమైంది డాగీకి. ఆ మనిషి మరో పది అడుగులు వేయడానికి వేచి ఉన్న డాగీ చెవిలో మరో వీధి కుక్క గుసగుసలాడిరది. అక్కడ రోడ్డు మీద చూశావా అంది. తను చూసిందాన్ని అది కూడా చూడ్డం నచ్చలేదు డాగీకి. నిన్న నా కాలుకి దెబ్బ తగిలింది. నేను పరుగెత్తలేను. నాలుగడుగులు వేసి దాన్ని తీసుకువస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం అంది. చూసింది నేను తెచ్చేది నేను తనకు వాటా అని విసుక్కుంటూ నాలుక్కాళ్ల మీద గుర్రంలా గ్యాలప్‌ చేసి వెళ్లి అందుకు వచ్చింది ఆ మాంస ఖండాన్ని. దాన్ని నోట కర్చుకుని అట్నుంచి అటే పోవచ్చు కాని జాతి లేకపోయినా కొంత నీతి ఉన్నది కనుక వెనక్కు వచ్చింది.
తెచ్చావా! నేను చెప్పడం వల్లే కదా తేగలిగావు. ఏదీ నోటి నుంచి జారవిడువు. ఎలాగ ‘షేర్‌’ చేసుకోవచ్చునో చూద్దాం అంది వీధి కుక్క. నిజానికి తను శ్రమపడిరది కదా తనకే ఎక్కువ షేర్‌ రావాలి మరి అనుకుంటూ తనకు మాత్రమే రావల్సిన దానిని పంచడానికి నేల జార్చింది డాగీ. కొన్ని సంఘటనలు మెరుపులా జరిగిపోతయి. ఊహకు అందకుండా జరిగిపోతయి. వీధి కుక్క నేల మీది మాంస ఖండాన్ని నోటితో అందుకుని గాలిలోకి డైవ్‌ చేసి ‘ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా’ లా పరుగుతీసింది. కళ్లు బైర్లు కమ్మినవి డాగీకి. ఏం చెయ్యాలో తేల్చుకోక ముందే ఆ వీధి కుక్క వీధి చివర మలుపు తిరిగి మాయమై పోయింది.
ఎంత మోసం! ఎంత దగా! అనుకుంటూ ఇంటి దారి పట్టింది డాగీ. అరుగెక్కిన డాగీని చూసి ఏంవాయ్‌ ముఖం వేలాడేశావు? అనడిగింది డాంకీ సైకాలజీ ప్రొఫెసర్‌ గిరీశంలా. ముఖాన్ని ఇట్టే గుర్తుపట్టేస్తుంది ‘ఫేస్‌ రీడిరగ్‌’ తెల్సిన డాంకీ అనుకున్న డాగీ ‘ముందు దగా వెనుక దగా, కుడి ఎడమల దగా దగా’ అన్నది. పొయిట్రీ వస్తున్నదంటే ఏదో ట్రాజిక్‌ ఇన్సిడెంట్‌ జరిగిందన్న మాటే అంది డాంకీ. జరుగుతుంది. అంతా మోసం. ఈ లోకం మోసం… మోసం… ఎవరినీ నమ్మడానికి లేదు. ఈ మనుషుల నీతిమాలిన తనం, దగా కోరుతనం జంతువులకు ముఖ్యం ‘ఐకాన్‌’ లయిన కుక్కలకు కూడా అంటుకోవడం సిగ్గుచేటు…షేమ్‌…షేమ్‌ అంది డాగీ. అసలు జరిగిందేమిటో వివరించింది. నేరం నాది కాదు ఆకలిది అన్నట్టు తిండి కోసం సాటి కుక్క కక్కుర్తిపడిరదేమోలే. మనుషులతో పోల్చకు. వాళ్లకు ముఖ్యంగా ‘పాలిట్రిక్స్‌’ చేసే వాళ్లకు సిగ్గూ, శరమూ, చీమూ నెత్తురూ ఏమీ ఉండవు. ముఖం మీద ఉమ్మినా తుడుచుకుంటారు. పదవుల కోసం పార్టీలు మార్చేటప్పుడు, ఓట్ల కోసం ఏమార్చేటప్పుడు వాళ్లు గోతికాడి నక్కలుగా, పళ్లికిలించే హైనాలుగా మారిపోతారు అంది డాంకీ. అవసరం అయితే ఓటమి తలుపు తడుతుందని తెలిస్తే గుండెలు తీసే బంటులవుతారు, తలలు పగలగొట్టే కర్రలూ, పెట్రోబాంబులూ అవుతారు ‘నో డవుట్‌’ అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. డైలాగ్‌ కంటిన్యూటీలో పంచ్‌లు ఫెళ్లుమనిపించడంలో త్రివిక్రముడివే నువ్వు అంది డాంకీ. ఎన్నికల మర్నాటి సీనే కదా ‘బ్రో’. మరి అంది డాంకీ. ఎన్నికల మర్నాటి సీనే కదా ‘బ్రో’. మరి తగలబడ్డ ఇళ్లు, మంటల పాలయిన ఖరీదైన కార్లు, ఏ క్షణాన్నయినా పేలడానికి ‘సిద్ధం’ అయి ఉన్న నాటుబాంబులూ వాటి సంగతేమిటి అంది డాగీ.
అందితే బటన్లు నొక్కడం, అందకపోతే ‘హింస రచన’ అంతే. ఓట్లేసినోళ్లే అక్కచెల్లెమ్మలే, అవ్వలూ, తాతలూ, వేయని వాళ్లకు శిక్షలూ పరీక్షలూ, రక్తపాతాలు అన్నాడు అబ్బాయి. అవునన్నా, అవునంటే మనోడు, కాదంటే పగోడు. ఎన్నికలనాటిదాకా ఓటర్లే దేవుళ్లు. ఎన్ని ఎత్తులు…ఎన్ని జిత్తులు…ఎన్ని పథకాలు, ఎన్నెన్ని ఉచితాలు. మాటలు కావవి తేనెల ఊటలు. ఎంత తియ్యగా. ఎంత మెత్తగా జనానికి మాటలతో మైకం కమ్మేట్టు చేశారు. అందితే జుత్తు, అందకపోతే కాళ్లు అంటే ఇదేనేమో అంది డాంకీ. రాజకీయం అంటే ఇదే మరి. మాటలతో మోసం చేసి బురిడీ కొట్టించడం. ఏరుదాటే వరకు ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న. మోసపు మాటలతో, బూటకపు కూతలతో పదవి దక్కించుకోడం ఆ తర్వాత విశ్వరూపం ప్రదర్శించడం. అందరూ మోసగాళ్లే ‘బ్రో’ ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలీని ప్రజలు కసాయి వెంట నడిచే గొర్రెలు అంది డాగీ తనకు జరిగిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ.
నువ్వన్నది నిజంగా నిజం. మోసమే ఈ రంగ నిపుణుల అసలైన అస్త్రం. తాడిని తన్నే వాడొకడయితే వాడి తలదన్నేవాడు ఇంకొకడు. కొందరు మామూలు మోసగాళ్లయితే మరికొందరు మోసగాళ్లకు మోసగాళ్లు. అయితే ఎవరు ఎలాంటి వారో తెల్సుకుని ఓటు వేసే ప్రజలు ఈ మోసగాళ్లకు మోసగాడెవడో గుర్తిస్తారులే అన్నాడు అబ్బాయి.
అవునన్నా నువ్వన్నది అవ్వల్‌ రైటు. తిండి కోసం దగాపడిన తమ్ముడ్నయినాసాటి కుక్కను క్షమించేప్తా కానీ తిన్నది అరక్క ఇంకా ఇంకా తినేవాళ్లను, అధికారంతో తమ నేరాలు ఘోరాలు తప్పించుకునే వాళ్లను ఓటర్లు క్షమించరాదన్నా అన్నది డాగీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img