Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

విద్యార్థులకు భద్రతలేని ఆశ్రమ స్కూళ్లు

గిరిజన విద్యార్థినీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమ స్కూళ్లు విద్యార్థులకు భద్రత కల్పించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయ గూడెం గిరిజన ఆశ్రమ స్కూలులో ఒక విద్యార్థిని హతమార్చారు. ఆశ్రమ పాఠశాలలో సుమారు 165 మంది విద్యార్థులు చదువు తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో ఎక్కువ మంది కొండరెడ్లు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రిమిటివ్‌ వనరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పీవీటీజీ)కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. 2023 జూలై 10వతేదీ రాత్రి ఈ ఘోరంజరిగింది. 4వ తరగతి చదువుతున్న అఖిల్‌ గోవర్థన్‌రెడ్డి(9)ని బుట్టాయగూడెం ఆశ్రమపాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. అర్ధరాత్రి నిద్రిస్తుండగా ఇద్దరు రూములోకి చొరబడి అఖిల్‌ గోవర్థన్‌రెడ్డిని బయటకు ఎత్తుకొచ్చి చంపారు. కాంపౌండ్‌ లోపలే ఈ ఘోరం జరిగింది. పైగా ‘బతకాలనుకున్నవారు వెళ్లిపొండి. ఎందుకంటే ఇకనుండి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇట్లు మీ….’ అంటూ అక్కడ ఒక లేఖను రాసి వదిలేశారు. 11న పోలీసులకు అక్కడి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పది టీములుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. అఖిల్‌ గోవర్థన్‌రెడ్డి పక్కన పడుకున్న మరో విద్యార్థి హంతకులను గుర్తుపట్టి పోలీసులకు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు.
ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వంటమనిషి, వాచ్‌మెన్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉందని, దానిని చూడటం వల్ల ఎలాగైనా ఈ విద్యార్థిని చంపేయాలనే ఆలోచనకు వారువచ్చారనేది పోలీసుల దర్యాప్తులో తేలిందన్నది విశ్వసనీయసమాచారం. అందుకు పదో తరగతిలోఉన్న విద్యార్థులను వాడుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం హత్యకు సంబంధించి ప్రధానకోణంగా చూడాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోకుండా విద్యార్థులకు మధ్య పాత కక్షలు ఉన్నాయని, అందులో భాగంగానే ఈ హత్య జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్‌లో వెల్లడిరచడం విశేషం. ఆశ్రమ పాఠశాలలో 165మంది విద్యార్థులకు 25మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆశ్రమ స్కూలుకు నైట్‌ వాచ్‌మెన్‌ కూడా ఉన్నాడు. ఆశ్రమస్కూల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అక్కడే ఉండాలి. కానీ రాత్రి అయ్యేసరికి విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా ఉండరని తెలుస్తోంది. తెల్లవారిన తరువాత ఎప్పడు స్కూలుకు వస్తారో తెలియదని ప్రజలు అంటున్నారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్‌, హాస్టల్‌ వార్డెన్‌, డిప్యూటీ వార్డెన్‌, వాచ్‌మెన్‌, కామాటి, వంటమనిషితో కలిపి అందరూ బాధ్యతా రాహిత్యంగానే వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
ఈ ఆశ్రమ పాఠశాల కేవలం బాలుర కోసం ఏర్పాటు చేసిందే. ఆడపిల్లలు ఇక్కడ ఉండరు. ఒకరితో ఒకరికి తగాదా ఉన్నా మరుసటి రోజు అందరూకలిసి ఆడుకునే పరిస్థితి ఉంటుంది. తొమ్మిది సంవత్సరాల విద్యార్థిని 14ఏళ్ల వయస్సున్న విద్యార్థులు ఇద్దరు కాళ్లు, చేతులు విరిచి, మర్మావయవాలు పగిలిపోయేలా తొక్కి, మెడపై కాళ్లతో తొక్కి సాగదీసి చంపేశారంటే ఎంత కక్ష వారిలోఉండాలి. అంతకక్ష ఎందుకు వస్తుంది? కుటుంబ కక్షలు ఉన్నాయా అంటే అటువంటివేమీ లేదని గూడేల్లోని గిరిజనులు చెబుతున్నారు. అంటే తప్పకుండా ఈ హత్య వెనుక హాస్టల్‌సిబ్బందిలోనే ఎవరో ఒకరిహస్తం ఉంటుందని అనుమానించాల్సివస్తుంది. ఉపాధ్యాయులకు, వార్డెన్‌లకు, వంట మనుషులకు, వాచ్‌మెన్‌కు మధ్య స్పర్థలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరి మధ్య స్పర్ధలే ఈ విద్యార్థి హత్యకు దారితీసి ఉంటుందని అనేక మంది అనుమానం. వాచ్‌మన్‌, వంటమనిషి, డిప్యూటీ వార్డెన్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. హత్య జరిగిన రాత్రి వాచ్‌మెన్‌ హాస్టల్‌లో లేడని తెలుస్తోంది. ఆ ఒక్కరోజే కాదు, ప్రతి రోజూ వాచ్‌మన్‌ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు తప్ప హాస్టల్‌లో ఉండడు. హత్య జరిగిన తరువాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి.
అఖిల్‌ గోవర్థన్‌రెడ్డి ఘోరంగా హత్యకు గురికావడంతో భయపడిన తల్లిదండ్రులు నేరుగా లారీల్లో ఆశ్రమ స్కూలు వద్దకు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకుపోయేందుకు సిద్ధమయ్యారు. వందల సంఖ్యలో వచ్చిన తల్లిదండ్రులను చూసి దిక్కుతోచని అధికారులు వారికి నచ్చజెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఎస్పీ, కలెక్టర్‌ చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు. హత్య జరిగిన తరువాత గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. హత్యకు గురైన విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంతటితో ఈ వ్యవహారాన్ని వదిలేయండంటూ పది లక్షలు పరిహారం కింద అందజేశారు. వీరిది వర్రింకి గ్రామం. బుట్టాయగూడెంకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
జి.పి. వెంకటేశ్వర్లు, ఫ్రీలాన్సర్‌, సెల్‌ నెం: 7842460555

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img