London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

మన విశ్వవిద్యాలయాలెక్కడ?

ప్రపంచ అత్యున్నత 200 విశ్వవిద్యాలయాల జాబితాలో ఒక్క భారతీయ యూనివర్సిటీకి కూడా చోటుదక్కకపోవడం, 700 యూనివర్సిటీల జాబితాలో 22 భారత యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయనే అంశాలు మన భారతీయ ఉన్నత విద్యాసంస్థల విద్యా ప్రమాణాలను వెక్కిరిస్తున్నాయని ఇటీవల ‘‘క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-సస్టేనబులిటీ 2024’’ విడుదల చేసిన అధ్యయన నివేదిక స్పష్టం చేస్తున్నది.
ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న యూనివర్సిటీల జాబితాలో యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోకు ప్రథమ స్థానం, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్‌ బర్కిలీలకు ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కాయి. బ్రిటీష్‌ కొలంబియా(4), ఆక్‌లాండ్‌(5), ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌(6), సిడ్నీ(7), లుండ్‌(8), మెల్బోర్న్‌(9), వెస్టర్న్‌ వర్సిటీ(10) తొలి 10స్థానాల్లో నిలిచాయి. యూనివర్సిటీల ర్యాంకుల నిర్థారణలో అకడమిక్‌ రెప్యుటేషన్‌కు 30శాతం, ఎంప్లాయర్‌ రెప్యుటేషన్‌కు 15శాతం, అధ్యాపక-విద్యార్థుల నిష్పత్తికి 10శాతం, సైటేషన్స్‌ ఫర్‌ ఫ్యాకల్టీకి 20శాతం, ఇంటర్నేషనల్‌ ఫ్యాకల్టీ రేషియోకు 5శాతం, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ రేషియోకు 5శాతం, ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ నెట్‌వర్క్‌కు 5శాతం, ఎంప్లాయిమెంట్‌ అవుట్‌కమ్‌కు 5శాతం, సస్టేనబులిటీకి 5శాతం ప్రాధాన్యత పొందాయి.
అత్యున్నత ప్రమాణాలు కలిగిన 700 ప్రపంచ వర్సిటీల జాబితాలో 22 భారతీయ వర్సిటీలు మాత్రమే చోటు దక్కించుకోవడం విచారకరం. దేశీయ అత్యుత్తమ వర్సిటీల్లో 220వ ర్యాంకులో యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, 303వ స్థానంలో ఐఐటీ ముంబై, 344వ స్థానంలో ఐఐటీ చెన్నై, 349వ స్థానంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌, 387వ స్థానంలో ఐఐటీ రూర్కీ, 426వ స్థానంలో ఐఐటీ దిల్లీ, 444వ స్థానంలో బిట్స్‌ పిలానీ, 449వ స్థానంలో విఐటీ వెల్లూర్‌, 496వ స్థానంలో అన్నా యూనివర్సిటీ చోటు దక్కించుకున్నాయి. 500-600ల మధ్య ఐఐఎస్‌(505), ఐఐటీ కాన్పూర్‌(522), జెఎన్‌యూ(545), మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌(576), శాలినీ వర్సిటీ(579) నమోదయ్యాయి. 600-700 మధ్య ర్యాంకులు పొందిన భారతీయ వర్సిటీల్లో జాదవ్‌పూర్‌ వర్సిటీ(619), అలీఘడ్‌ ముస్లిమ్‌ వర్సిటీ(620), ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌అండ్‌ టెక్నాలజీ(629), థాపర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(637), అమిటీ వర్సిటీ(667), ఎల్‌పియూ(672), ఎన్‌ఐటీ రూర్కీ(676), ఐఐటీ వారణాసి(684) సంస్థలు ఉన్నాయి. పర్యావరణ సుస్థిరతతో విఐటీకి తొలి 100 యూనివర్సిటీల జాబితాలో, పర్యావరణ/వాతావరణ విద్యా బోధనలో దిల్లీ వర్సిటీకి 16వ స్థానం, గుడ్‌ గవర్నెన్స్‌ సూచికలో మణిపాల్‌(11), దిల్లీ వర్సిటీ(167)లకు 200 లోపు ర్యాంకులు దక్కడం కొంత ఊరట కలిగిస్తున్న అంశం. క్యూఎస్‌ ఏసియా ర్యాంకింగ్స్‌-2024 జాబితాలో 148 భారతీయ, 133 చైనా ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.
భారత వర్సిటీలు ఉత్తమ ఫలితాలను సాధించడానికి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆధునిక తరగతి గదులు, లాబొరేటరీలు, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, ఆడిటోరియమ్స్‌, క్రీడావసతితో పాటు అంతర్జాతీయ విద్యార్థులకు అడ్మిషన్లు, అంతర్జాతీయ అధ్యాపకుల నియామకాలు, పెటెంట్లు పొందే స్థాయి పరిశోధనలు, సైటేషన్స్‌ ఫర్‌ ఫాకల్టీలో మెరుగైన ఫలితాలు, అధ్యాపకుల` విద్యార్థుల నిష్పత్తి, ఇంటర్‌ డిసిప్లెనరీ రీసర్చ్‌కి చోటివ్వడం, పరిశ్రమలతో అనుసంధాన విద్య, హుమన్‌-సెంట్రిక్‌ బోధనలు, సస్టేనబులిటీ-ఫోకస్డ్‌ ఎడ్యుకేషన్‌, అంతర్జాతీయ వర్సిటీలతో సహకార సమన్వయాలు నెలకొల్పడం లాంటి అంశాల్లో సుస్థిరత సాధించడం ఏకైక మార్గంగా ఉంది. విద్యార్థుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఉపయుక్తమైన ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సిసి లాంటి విద్యేతర అంశాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
ఫోన్‌: 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img