acaiwater.com www.bonusheda.com www.bonusorti.com www.bonusdave.com gamersbonus.com www.bonusarsiv.com www.bonusfof.com rcflying.net www.bonustino.com www.onlinesporbahisi.com texasslotvip.com gamefreebonus.com bonusrey.com visiopay.com heatextractors.com
Friday, September 27, 2024
Friday, September 27, 2024

వంద రోజుల పాలనలో కార్మికులకు సున్నా

ఎస్‌. వెంకటసుబ్బయ్య

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. ఈ వంద రోజుల పాలనలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని ఇక నుంచి కూడా ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు, అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇస్తున్నారు. కాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచిపోయారనిపిస్త్తోంది కేవలం వృద్ధాప్య పింఛను పెంపు, అన్న క్యాంటిన్లు, మెగా డీఎస్సీ, ల్యాండ్‌సీలింగ్‌ యాక్టు రద్దుతో సరిపెట్టుకుంటే లాభంలేదు. ఇటీవల విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలలో వచ్చిన వరదల్లో బాధితులను ఆదుకోవడంలో యుద్ధం చేశామని చెప్పడం మంచిదే కాని విజయవాడలో, రాష్ట్రంలోని అన్నిప్రాంతాలు, అన్ని రంగాల ప్రజలను ఇదే పద్ధతిలో చూసుకోవాలి.
ముఖ్యంగా రాష్ట్రంలో లక్షాలాది మంది ఉన్న అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఈ 100 రోజులు వేలమంది అసంఘటిత కార్మికులు వారి వారి సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ని, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ని కలిసి వారి సమస్యలు విన్నవించారు. అయినా ఈ రంగాల వారి ఒక్క సమస్య కూడా నేరవేరలేదు కేవలం వారితో దిగిన పోటోలు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే ఇటీవల కొందరు పేద మహిళలు లోకేశ్‌ ఇంటివద్ద తెల్లవారు జామున 4 గంటలకు క్యూలో ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్వీపర్లు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మా ప్రభుత్వం వచ్చింది మీరు పనిమానుకోండి అంటూ గ్రామాలల్లో రాజకీయ వేధింపులుచేస్తూ అనేక మందిని తొలగిస్తున్నారు. దీనితో విద్యాశాఖ మంత్రి వద్ద తమ గోడువెళ్లబోసుకునేందుకు వారంతా. లోకేశ్‌ ఇంటికి వచ్చారు. అయినా ప్రయోజనం మాత్రం శూన్యం, మెడికల్‌ కాంట్రాక్టు కార్మికులు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్పందనలో ఆ రోజు అందుబాటులో ఉన్న అర్లగడ్డ వెంకట్రావుకి వినతిపత్రం అందజేశారు. వారికి రావాల్సిన 8 నెలలు వేతనాలు రాలేదు దీనిపైన ఏ మాత్రం స్పందన లేదు. విద్యుత్‌ రంగంలోని మీటరు రీడర్లు, షిఫ్టు ఆపరేటర్లు వారి న్యాయమైన కోర్కెలపై మెమోరాండం సమర్పించారు. దీనిపై ఇంత వరకు అతీగతిలేదు. సచివాలయ ఎనర్జీ అసిటెంట్లు వారి కోరికలు విన్నవించారు వాటిపైనా స్పందన కరువే. ముఖ్యంగా గత ప్రభుత్వ హయం చివరిలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు 1 లక్ష ఆరువేల మంది 42 రోజులు వీరోచిత సమ్మెపోరాటం కొనసాగించారు. అ సమ్మెను అణచడానికి జగన్‌ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించి బెదిరించింది. అయినా అంగన్వాడి టీిచర్లు భయపడలేదు. చివరికి ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపి జులై 2024 నుంచి జీతాలుపెంచి ఇస్తామని ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో అంగీకరించారు. అనాడు అంగన్వాడిల పోరాటానికి తెలుగుదేశంపార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. కాని ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రాలేదు. ఈ సమస్యపై అనేకసార్లు అధికారులను, నారా లోకేశ్‌ను కలిసినా ప్రయోజనంలేదు. ఆశా కార్మికుల సమస్యలు, వేధింపులు ఎక్కువ అయ్యాయి. వారి గోడు వినే నాధుడే లేదు. వీరికి అనేక రకాల యాప్‌లు పెట్టి పనిభారం పెంచారు. పని వత్తిడి తగ్గించి రాజకీయ వేధింపులు ఆపాలని అనేక దఫాలు ప్రభుత్వాన్ని కోరినా ఫలితంలేదు. అసంఘటిత రంగంలో కీలకమైనది భవన నిర్మాణ రంగం.
ఈ రంగంలో రాష్ట్రంలో 50 లక్షల మంది ప్రతినిత్యం కష్టపడి పనులు నిర్వహిస్తుంటారు. వీరికి 1996 భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ప్రకారం సంక్షేమ బోర్డు 2006లో నెలకొల్పి 12 రకాల సౌకర్యాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వం ఈ బోర్డును అపేసింది. ఈ సమస్యపై రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అనేక పోరాటాలు నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల పోరాటానికి నారా చంద్రబాబునాయుడు బాగా మద్దతిచ్చారు. గట్టిగా పోరాడండి అని నొక్కివక్కాణించారు. పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంక్షేమ బోర్డు పునరుద్దరణకు 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు అధికారం లోకి రాగానే ఈ కార్మికుల విషయమే మరచిపోయారు. ఇసుక విధానం కూడ మార్పుచేసినా ఇంకా గాడిలో పడలేదు. ఉచిత విధానం అంటున్నా ఇప్పటికి ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. దీనిపైనా ప్రభుత్వానికి చలనం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్దరించే ఆలోచనే లేదు. మరో ముఖ్యమైన రంగం మున్సిపల్‌ కార్మికులు వీరు కూడ గత ప్రభుత్వ హయంలో 14 రోజుల పాటు 77 మున్సిపాలిటీలల్లో, 17 కార్పొరేషన్లలో సమ్మె నిర్వహించి కొన్ని కోర్కెలు సాధించారు. ఇంకా కొన్ని అపరిష్కృతంగా మిగిలిపోయాయి వాటిని ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వంటవాళ్ల సమస్యలు ఆధికంగా ఉన్నాయి, వారికి నెలకు కేవలం రు.3వేలు మాత్రమే ఇస్తున్నారు వారి గురించి అలోచనే చేయరు. అన్ని రాష్ట్ర కార్యాలయాల్లో హౌస్‌కీపింగ్‌ వారిని, అటెండర్లను అప్కాస్‌లో కలపాలని కోరినా ఫలితంలేదు పట్టించు కోవడంలేదు
మరో పక్క స్వఛ్ఛభారత్‌ మిషన్‌ కింద అన్ని నగర, మేజర్‌ పంచాయితీలలో గ్రీన్‌ అంబాసిడర్లు 17 నెలలుగా జీతాలు ఇవ్వక చాల ఇబ్బందులు పడుతున్నారు, క్లాప్‌ డ్రైవర్లది కూడా ఇదే పరిస్థితి. ఈ మంత్రిత్వశాఖ పవన్‌ కల్యాణ్‌ పరిధిలోనే ఉంది. అయినా ఫలితంలేదు. మరో పక్క స్కూలు స్వీపర్లకు 7 నెలలుగా వేతనాలు లేవు వీరితో పాటు అనేక రంగాలల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల కష్టాలు వర్ణణాతీతం. గత పాలనలో సచివాలయ వ్యవస్థ క్రింద నియమితులైన 2 లక్షల 56 వేల మంది వలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఉంచుతారో, ఊడపీకుతారో తెలియని పరిస్థితి. వీరికి కూడా జీతభత్యాలు ఇవ్వకుండా గాలిలో పెట్టారు. కార్మికవర్గం పట్ల నిర్లక్ష్యం వహించిన పాలకులకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంగనామాలు పెట్టి 11 సీట్లు మాత్రమే ఇచ్చిన పరిస్థితి నేటి పాలకులు మరిచినట్లు ఉన్నారు. వీరికి కూడా ఈగతి పట్టక ముందే అసంఘటితరంగ కార్మిక సమస్యలపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో లక్షాలాది మంది ఉన్న ఆటో, హమాలి(ముఠా) కార్మికుల, వీధి విక్రయదారుల సమస్యలు పరిష్కరించాలి. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి. ఈ సమస్యలను ఎన్నికల సమయంలోనూ ప్రస్తావించారు. నేడు అ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ గోదాములలో లోడిరగు అన్‌లోడిరగు చేసే కార్మికులకు వేతనాలు పెంపుదల చేయవలసిఉన్నా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యలేవీ రాష్ట్ర ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ప్రతిపక్ష పార్టీ కూడా ఇన్ని సమస్యలు ఉంటేె వీటిని వదిలేసి చంద్రబాబునాయుడు మాయ వ్యాఖ్యానాలకు ప్రతివ్యాఖ్యానాలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో కార్మికుల సమస్యలు కోకోల్లలుగా ఉన్నాయి. పంచాయతీరాజ్‌, ఆటవి శాఖల్లో కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కావడం లేదు ఇతర మంత్రిత్వశాఖల పరిధిలోని వివిధ విభాగాల్లోనూ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వందరోజుల పాలన ఎలా బాగుంది. ఈ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుందో ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి. కార్మిక సంఘాలు ఈ 100 రోజులు ఎంతో సంయమనం పాటించారు. ప్రభుత్వం రాగానే పోరాటం ఎందుకులే కొద్దిగా సమయం ఇద్దామని వేచి చూస్తున్నారు. అయినా ప్రభుత్వ తీరులో మార్పులేదు.
సెల్‌: 9949207506
ఏఐటీయూసీి రాష్ట్ర డిప్యూటి ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img