Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ప్రత్యామ్నాయ సాధన కృషిలో ఇండియా

డి. రాజా,
సీపీఐ ప్రధాన కార్యదర్శి

‘‘మనం వైరుధ్యాలుగల జీవనరంగంలోకి ప్రవేశించనున్నాము, మనకు రాజకీయరంగంలో సమానత్వం ఉంటుంది, సామాజిక, ఆర్థిక జీవనంలో సమానత్వం ఉండదు’’ అని ఏడు దశాబ్దాల క్రితం 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ తీవ్ర హెచ్చరిక చేశారు.
మనకాలంలోనూ మనం వైరుధ్యాలను ఎదుర్కొంటూనే ఉన్నాము. అంతేకాదు చాలా ఎక్కువగా ఎదుర్కొంటూనే ఉన్నాము. రాజకీయ, సామాజిక ఆర్థిక రంగాలలో సమానత్వంపై దాడులు జరుగుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలమేరకు మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంచేసే హానికర చర్యల్లో రాజకీయ, సామాజిక, ఆర్థికరంగాల్లో అసమానతను మరింతగా పెంపొందించడం అతి పెద్దహాని. అన్నిచోట్ల అసమానత స్పష్టంగా తెలుస్తుంది. మైనారిటీల పట్ల వివక్ష తీవ్రమైంది. కనికరంలేని కులపరమైన కట్టుబాట్ల కాఠిన్యాలు నిత్యం అధికమవుతున్నాయి. ఇవి దేశాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయి. కొద్దిమంది చేతుల్లో అత్యధిక సంపద చేరడం పెరుగుతూనే ఉంది. అసమానతలకు, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు అనుసరిస్తున్న ఒకే విధమైన మత ఆశ్రిత పక్షపాత మూలకారణం నిర్మూలించడానికి సెక్యులర్‌, ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యం కావడమే పరిష్కారం. సెక్యులర్‌, ప్రజాస్వామిక వ్యవస్థపై దాడిని ప్రతిఘటించి ఓడిరచాలి. ఇండియా రక్షణకు, ఇండియాను మార్చేందుకు సెక్యులర్‌ ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా కృషిచేయాలి.
కొత్తగా ఏర్పడిన ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్సును (ఇండియా) రూపకల్పన చేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా విస్తృత చర్చనీయాంశమైంది. ఇది ‘ఇండియా’ను రూపొందించడం వల్ల ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల ఆశ్రిత పెట్టుబడిదారీ, ద్వేషపూరిత, విచ్ఛిన్నకరమైన ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని సాధించేందుకు సెక్యులర్‌, ప్రజాస్వామ్య శక్తులకు అవకాశం కల్పించింది. మరోవైపు సెక్యులర్‌, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత మరింత బలపడిరది. ఇదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో ఉన్న మితవాద గ్రూపుకు సంబంధించిన శక్తులు ఓరిమికోల్పోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల ఐక్యతను, సెక్యులర్‌ ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ భావనతో ఏకమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాస్వామ్య శక్తులతో కూడిన ఫ్రంట్‌ను ఈస్ట్‌ ఇండియా కంపెనీతో పోల్చి విమర్శించారు. దేశ భక్తియుత, వామపక్షశక్తులు ఈస్ట్‌ఇండియా కంపెనీని తరిమికొట్టేందుకు అలాగే బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని దేశంనుంచి సాగనంపేందుకు సాగించిన పోరాటాన్ని, త్యాగాలను కావాలని మోదీ విస్మరిస్తున్నారు. వలసవాద ప్రభుత్వం నుంచి దేశాన్ని విముక్తి గావించేందుకు దేశప్రజలంతా స్వాతంత్య్ర పోరాటం నిర్వహిస్తుండగా బ్రిటిష్‌వారికి విధేయులుగా ఉన్నవారు మోదీకి మాత్రమేకాదు, అందరికీ తెలుసు.
బీజేపీ అధికారానికి వచ్చాక జరిగిన తొమ్మిదేళ్ల కాలంలో దేశప్రజలు బీజేపీ ప్రభుత్వ పాలనను గమనిస్తూనే ఉన్నారు. మన ఆర్థికవ్యవస్థలో ఒక రంగం తర్వాత మరోరంగం తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. నియంతృత్వ ధోరణిలో ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన సాగిస్తున్నారు. పెద్దనోట్లరద్దు ప్రజలను పూర్తిగా కష్టాలపాలు చేసింది. ఫెడరల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగాఉన్న జీఎస్‌టీని ఆఘమేఘాలమీద అమలుచేసి దేశానికి, అసంఘటిత రంగానికి తీవ్ర నష్టం కలిగించారు. ఆర్థికవ్యవస్థను తప్పుదారి పట్టించడంవల్ల నిరుద్యోగ సంక్షోభం ఏర్పడిరది. అలాగే కొవిడ్‌19 మహమ్మారి నియంత్రణకు అనుసరించిన మార్గాలు సక్రమంగాలేక తీవ్ర కల్లోలం ఏర్పడిరది. మోదీ పరిపాలనలో అసమానతలు పెరిగాయి. అదే సమయంలో కార్పొరేట్లకు అపార ప్రయోజనాలను మోదీ కల్పించారు. ఇలాంటి చర్యలద్వారా మన ఆర్థికవ్యవస్థలోని సామాజిక రంగం బలిపశువైంది. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రణలో సాగిన పరిపాలనలో భారతదేశంలో అన్ని సామాజిక, అభివృద్ధికి సంబంధించిన సూచికలు దిగజారిపోయాయి. ఫలితంగా మనసమాజంలోని అణగారిన వర్గాల ప్రజలు తీవ్ర నష్టాలకు, కష్టాలకు గురయ్యారు. గత తొమ్మిదేళ్లకాలంలో సంపన్నుల సంపద భారీగా పెరగడం యాదృచ్ఛికమేమీకాదు. మోదీ పరిపాలనవల్లనే ఇది జరిగింది. మోదీ ప్రభుత్వం అనుసరించిన ఆశ్రిత పెట్టుబడీదారీ వ్యవస్థలో పేదలనుండి ప్రతిదీ లాక్కుని కార్పొరేట్లను ప్రయోజనాలతో ముంచెత్తారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా తయారయ్యాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వీధుల్లోకివచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అంతేకాదు, మన రాజ్యాంగంలో పొందుపరచిన విలువలను వేగంగా దిగజార్చేందుకు మోదీ ప్రభుత్వం పూనుకున్నది. అధికారంకోసం అర్రులు చాచిన బీజేపీ భారతదేశ సమాజాన్ని తీవ్రంగా ధ్వంసం చేసింది. దేశ ప్రజల మధ్య విభజనను తీవ్రతరం చేసింది. మతం, కులం,భాష, ప్రాంతీయత ఆధారంగా విభజించి మన దేశ పురోగతిని ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ ప్రభుత్వం వెనక్కునెట్టింది. విభజించి పాలించు విధానాన్ని తమ బ్రిటీష్‌ మాస్టర్లనుంచి నేర్చుకుని విచ్ఛిన్నకర క్రీడను నిర్వహించింది. బ్రిటీష్‌ పాలకులు అనుసరించిన పాలనను అందిస్తూ వారు అమలుచేసిన ఎత్తుగడలను వినియోగిస్తున్నారు. విచ్ఛిన్నకర పాలనద్వారా మోదీ విధ్వంసకర ఫలితాలను సాధించారు. ఇటీవల మణిపూర్‌ రాష్ట్రంలో మంటలు చెలరేగుతున్నప్పటికీ మోదీ చూస్తూ మౌనంగా ఉన్నారు. వివిధ అంశాలపై ఇష్టానుసారంగా మాట్లాడే మోదీ మణిపూర్‌పైన అనేక నెలలపాటు మాట్లాడకుండా మౌనం వహించారు. ప్రభుత్వ పాలనా విధానాలను విమర్శించేవారిని దుష్టచట్టాలను వినియోగించి బలవంతంగా నోళ్లు మూయించారు. మన రాజ్యాంగంలో పొందుపరచిన అలాగే స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం చేసిన ప్రజాస్వామ్య విలువలను, సంప్రదాయాలను దారుణంగా దిగజార్చారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగిస్తుందా అన్న తీవ్రమైన ప్రశ్నను మనం ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఇండియా ఏర్పాటుపైన దేశవ్యాప్తంగా చర్చించాలి. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండవలసిన తరుణం ఆసన్నమైంది. ఇదే సమయంలో ప్రజలందరినీ ఐక్యంగా ఉంచాలి. ప్రత్యేకించి ప్రభుత్వాన్ని మార్చడమేకాకుండా గుణాత్మకమైన మార్పును తీసుకురావాలని సీపీఐ భావిస్తోంది. బీజేపీ రాజకీయంగా, సైద్ధాంతికంగా సెక్యులర్‌, ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ఎదుర్కోవాలి. సెక్యులర్‌, ప్రజాస్వామ్యశక్తులు ఐక్యమైతే ఓట్లు చీలిపోకుండా నిరోధించేందుకు బీజేపీ అనుసరిస్తున్న మెజారిటీ అజెండాను తుత్తినియలు చేయవచ్చు. ఇండియాలో భాగస్వాములైన పార్టీలన్నీ సర్దుబాటు వైఖరితో, మేలైన అవగాహన, పరస్పర విశ్వాసాన్ని మరింత పెంచుకోవడం ఎంతైనా ముఖ్యం. ఈ మార్గాన్ని అన్నిపార్టీలు అనుసరిస్తే బీజేపీని ఓడిరచి దేశాన్ని రక్షించవచ్చు. రాష్ట్రాల స్థాయిలో నిర్దిష్టమైన మార్గాలను రూపొందించుకోవాలి. దేశవ్యాప్తంగా ఉనికి గలిగిన కాంగ్రెస్‌కు ఈ విషయంలో ప్రత్యేక బాధ్యత ఉంది. ఈ లక్ష్యాల సాధనకు జూన్‌లో బిహార్‌ రాజధాని పట్నాలో మొదటి సమావేశం జరిగింది.15 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై చర్చించి, బీజేపీని ఓడిరచవలసిన కర్తవ్యాన్ని నిర్థారించుకున్నారు. రెండవ సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీల సంఖ్య 26కు పెరిగింది. ఈ సమావేశంలోనే అన్ని పార్టీలు కలిసి ఇండియా పేరుతో ఐక్యతను ప్రదర్శించాయి. ఎన్‌డీఏకు దూరమైన పార్టీలను దగ్గర చేర్చుకునేందుకు బీజేపీ తీవ్రంగా తంటాలుపడిరది. ఎన్‌డిఏ సమావేశానికి హాజరైన పార్టీలన్నీ చాలా చిన్న చిన్నవి. దిల్లీలో జరిగిన ఎన్‌డీఏ సమావేశంలో భాగస్వాములైన 36పార్టీలు హాజరైనట్లు వెల్లడిరచారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలు ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ హిందుత్వ ఆశ్రిత అజెండాను రూపొందించడంపై అసంతృప్తిగా ఉన్నాయి. ఇండియాలో భాగస్వాములైన శక్తులు బ్రిటీష్‌ వలసపాలన నుండి దేశాన్ని విముక్తిచేసేందుకు పోరాడిన గొప్ప వారసత్వాన్ని కలిగిఉన్నాయి. దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత ఈ శక్తులు ప్రభుత్వరంగాన్ని అభివృద్ధిపరచి దేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు అపారంగా కృషిచేశాయి. సామాజిక వివక్ష, భాష, పిడివాదం, ఫెడరల్‌ రాజకీయాల వ్యతిరేకతలపై జరిగిన పోరాటంలో ప్రముఖపాత్ర వహించాయి. పోరాటం చేసిన శక్తులపై కార్మికులు, రైతులు, విద్యార్థుల, యువత విశ్వాసం బలంగాఉంది. ఇండియా ఫ్రంట్‌ ఏర్పాటుతో ఉక్రోషం తెచ్చుకున్న ప్రధానమంత్రి బరితెగించి ఫ్రంట్‌ను ఈస్ట్‌ఇండియా కంపెనీతో పోల్చారు.
ఇలా పోల్చిన మోదీ వామపక్ష దేశభక్తియుత శక్తుల చరిత్ర ప్రారంభదశలో ఎలా ఉన్నదని గుర్తు చేసుకోవాలి. అదే సమయంలో తమ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్ర కూడా గుర్తు చేసుకోవాలి. బ్రిటీష్‌ శృంఖలాల నుండి దేశాన్ని విముక్తి గావించేందుకు దేశభక్తియుత శక్తులు తమ రక్తాన్ని, స్వేదాన్ని ధారపోశారు. బ్రిటీష్‌ పాలకులకు విధేయులుగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర ఉద్యమాన్ని వ్యతిరేకించింది. స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిన నాయకులు బలమైన, సమ్మిళిత, సామరస్య పూరితమైన దేశాన్ని ఆకాంక్షించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం మౌలికసూత్రంగా ఉండాలని కోరుకున్నారు. ఇదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందుకు పూర్తి భిన్నంగా మత విభజన, కులం వారసత్వం పెంపొందించాలని కోరుకున్నది. ఇప్పుడు విద్వేషం నుంచి దేశాన్ని విముక్తి గావించాలి, సామరస్యపూరితమైన వాతావరణం కల్పించాలి. ఇందుకు ఇండియా సిద్ధం కావాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంకోసం ఇండియా లో భాగస్వాములైన పార్టీలన్నీ కృషి చేయాలి. ఐకమత్యంతో విజయాన్ని సాదిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img