Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

పశు సంపదపై రైతాంగం ప్రత్యేక దృష్టి వహించాలి

జిల్లా పశువైద్యాధికారి డాక్టరు మన్మదరావు

విశాలాంధ్ర – సీతానగరం : పశుసంపదపై రైతాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎస్.మన్మధరావు పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు స్థానిక పశువైద్యకేంద్రంలో సీతానగరం, బలిజిపేట మండలాల పశువైద్యాధికారులు, పశువైద్య సచివాలయాలసహాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. వేసవి దృష్ట్యా పశుసంపదపై రైతులు దృష్టి సారించేలా వారిని అవగాహన కల్పించాలని కోరారు. కృత్రిమ గర్భాధారణ ప్రగతిని సమీక్షించారు. వేసవికాలంలో పశువులకు వ్యాధులు సంక్రమించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. టీకాల కార్యక్రమాల గురించి చర్చించారు.మానవతా దృక్పథంతో పశువుల కోసం చలివేంద్రాలు ఏర్పాటుచేసే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ ప్రసాదరావు , ఏడీలు డాక్టర్ నీలయ్య, డాక్టర్ చింతాడ దీనకుమార్ , సీతానగరం బలిజిపేట పశువైద్యులు ఎస్ రామారావు గణేష్ వివిధ సచివాలయాల పశువైద్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img