Monday, May 20, 2024
Monday, May 20, 2024

ప్రయాణం సురక్షితం, సుఖప్రదంకావాలి

రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమంలోజిల్లా కలెక్టర్
విశాలాంధ్ర,పార్వతీపురం : ప్రయాణం సురక్షితం, సుఖప్రదం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం రహదారి భద్రతా మాసోత్సవాలను జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభం చేశారు.భద్రతా మాసోత్సవాల కరపత్రాలను విడుదల చేసారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20నుండి ఫిబ్రవరి 19వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతాయన్నారు. రహదారి భద్రతాపై ప్రతి ఒక్కరూ విధిగా అవగాహన కలిగి ఉండాలి ఆయన పిలుపునిచ్చారు. రహదారి భద్రత నియమాలు పాటించాలని, కుటుంబాన్ని, ఆత్మీయులను గుర్తు పెట్టుకోవాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
జిల్లారవాణా అధికారి సి మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా నిర్దేశిత తేదీలలో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఈనెల 22న రహదారి భద్రతపై వాలంటీర్లను గుర్తించి పార్వతీపురం, సాలూరు, పాలకొండలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈనెల 23, 24 తేదీలలో రహదారులపై గల బ్లాక్ స్పాట్ లపై పార్వతీపురంలో చర్చించడం జరుగుతుందని, 25, 27 తేదీలలో సాలూరు, పాలకొండలలో ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లతో రహదారి భద్రతాపై అవగాహనా వాక్ థాన్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.ఈనెల 29న పార్వతీపురంలో డ్రైవర్లకు ఆరోగ్య, నేత్రపరీక్షలు, 30, 31తేదీలలో పార్వతీపురం, సాలూరు, పాలకొండలలో విద్యా సంస్థల నిర్వాహకులు, డ్రైవర్లు, సరుకు రవాణా డ్రైవర్లకు అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఫిబ్రవరి 1 నుండి 3వరకు పార్వతీపురం, సాలూరు, పాలకొండలలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వలన అనర్థాలు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన అనర్థాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ద్విచక్ర వాహన ర్యాలీ., 5,6 తేదీలలో పార్వతీపురంలో ఆపదలో ఆదుకునే చట్టాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.ఫిబ్రవరి 8, 9 తేదీలలో పార్వతీపురం, సాలూరులో ఆటోమొబైల్ డీలర్లను భాగస్వామ్యం చేస్తూ ఆటో డ్రైవర్లకు అవగాహన,12న పార్వతీపురంలో మోటారు వాహనాల చట్టం క్రింద రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.13న సాలూరులో ఆర్ టిసి, మాక్సి కాబ్, మోటార్ కాబ్ తదితర ప్రజా రవాణా సాధనాల డ్రైవర్లు, యాజమాన్యాల భాగస్వామ్యంతో మహిళలకు అవగాహన, 14,15 తేదీలలో పార్వతీపురం, సాలూరులలో మోటార్ వెహికల్ బీమాపై సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.16న పార్వతీపురం, సాలూరులో లారీ యాజమాన్యాలను భాగస్వామ్యం చేస్తూ సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు అవగాహన., 17వ తేదీన పాలకొండలో పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్ నిర్వహణతో పాటు 19న పార్వతీపురంలో ముగింపు కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈకార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం శశి కుమార్, పాలన అధికారి జి సీతారాం, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎన్ రమేష్ కుమార్, జి సత్యనారాయణ, ఏ వర ప్రసాద్, బి కాశీరామ్ నాయక్, వైద్య అధికారి పి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img