Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

విద్యాసదస్సును విజయవంతం చెయ్యండి

ఎ పీ టీ యఫ్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గరుగుబిల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ఒకరోజు విద్యా సదస్సును ఆదివారం నిర్వహించుకుంటున్నట్లు జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్, బాలకృష్ణ సంయుక్తంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యారంగ పరిస్థితులు మన కర్తవ్యాలు అనే అంశం మీద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే భానుమూర్తి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలు అనే అంశం మీద రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు పాండురంగ వరప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు అనే అంశం మీద రాపాక నాగేశ్వరరావు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఫెడరేషన్ అధికార పత్రిక ఉపాధ్యాయలో ఔత్సాహిక వ్యంగ్య చిత్ర కళాకారునిగా ఆరంగేట్రం చేసిన ప్రముఖ ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, చిత్ర నఖ చిత్ర కళాకారుడు పల్ల పరిసినాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నఖచిత్ర కళా విశారద అనే బిరుదుతో సత్కరించడం జరుగుతుందని కావున ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, కళాభిమానులు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా వీరు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img