Saturday, April 13, 2024
Saturday, April 13, 2024

తండ్రికి తగ్గ తనయులు

గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న బ్రహ్మారెడ్డి కుమారులు

1కోటి 4 లక్షల రూపాయల వ్యయంతో చుండి నుండి పోలి నేనిచెరువు వరకు తారు రోడ్డు నిర్మాణం

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : మండలంలోని పోలినేని చెరువు గ్రామమాజీ సర్పంచ్,మాజీ ఎంపీటీసీ దివంగత ప్రజానేత యాళ్ల బ్రహ్మారెడ్డి తనయులు తండ్రికి తగిన వారసులుగా నిరంతరం గ్రామ అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతూ తండ్రి పేరు నిలబెడుతున్నారు ఈ క్రమంలో బ్రహ్మారెడ్డి లేని లోటును తీరుస్తూ గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలు ఏ చిన్న సమస్య సమస్య తలెత్తినా వెనువెంటనే స్పందిస్తూ ముఖ్యంగా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలో దశాబ్దాలుగా గ్రామస్తుల కోరికను నెరవేరుస్తూ ఏఎం సీ నిధులు 1కోటి 4 లక్షల రూపాయల నిర్మాణంతో చుండి నుండి పోలినేని చెరువు గ్రామం వరకు తారు రోడ్డు నిర్మాణం జరగటంతో ప్రజలు బ్రహ్మారెడ్డి కుమారులను ప్రశంసలతో ముంచేత్తుతున్నారు ఈ విధంగానే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి బ్రహ్మారెడ్డి తనయులు యాళ్ల శివకుమార్ రెడ్డి,యాళ్ల హరి బ్రహ్మారెడ్డి, యాళ్ల కిషోర్ రెడ్డిలు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img