Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఉన్నత ఆశయంతోనే జగనన్న సురక్ష కార్యక్రమం : జడ్పిటీసీ ఇంటూరి భారతి

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు పారదర్శక సేవలను అందుతున్నాయని జడ్పిటీసీ ఇంటూరి భారతి పేర్కొన్నారు.మంగళవారం మండలంలోని పోకూరు సచివాలయం ప్రాంగణం నందు పోకూరు సర్పంచ్ పర్రె కనకరత్నం అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జెడ్పిటీసీ ఇంటూరి భారతి,ఎంపీపీ పొనుగోటి మౌనిక హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన స్వర్ణ యుగాన్ని తలపిస్తుందని అన్నారు.అర్హులందరికీ సంక్షేమ పథకాలు పక్కాగా అందుతున్నాయని వివరించారు ప్రభుత్వం అందించే వివిధ సేవలు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్చిన అవసరం లేదన్నారు అవసరమైన సర్టిఫికెట్లను ఇళ్ల ముంగిటకే పంపిణీ చేయాలనే సంకల్పంతో జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకొని వచ్చారని అన్నారు.సంక్షేమపథకాల సారధిగా సీఎం జగనన్న ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని కొనియాడారు.తిరిగి సీఎం జగనన్న ను ఆశీర్వదించాలని కోరారు.ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ప్రజా సేవకై పరితపిస్తున్నారని వెల్లడించారు.ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రజా సేవకు సంకల్పిస్తున్నారని తెలిపారు.ఈ సందర్బంగా మండలమీడియా అధికారప్రతినిధి పరిటాల వీరాస్వామి,మండలజేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు,వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామస్థాయిలో ప్రభుత్వపథకాలకు అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడు మిగిలిపోకూడదనే సదుద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు 11రకాల సర్టిఫికెట్లు చేయబడతాయని ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,తహసీల్దార్ సుందరమ్మ,సచివాలయం సిబ్బంది,వైసీపీ సోషల్ మీడియా మండలకన్వీనర్ బందెల మాల్యాద్రి,నాయకులు పర్రె జగదీష్,అత్తోట చెన్నయ్య,లింగాబత్తిన మాల్యాద్రి,అత్యాల యోహాను,ఘట్టమనేని మాధవరావు, అత్తంటి హరిబాబు, అత్తంటి వెంకటేశ్వర్లు,గాలంకి మాలకొండయ్య,వలంటీర్లు,గృహసారధులు,లబ్ధిదారులు,గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img