Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

ఆటోను ఢీకొన్న లారీ… ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని మార్కెట్ యార్డ్ సిపిఎం ఆపోజిట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆగి ఉన్న ఆటోను తాడిపత్రి నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో బసనేపల్లి గ్రామానికి చెందిన ధనుంజయ రెడ్డి (42) అక్కడికక్కడే మృతి చెందా రు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ నిండి ప్రాణాన్ని బలి కొంది. వివరాలకు వెళితే మంగళవారం తెల్లవారుజామున ఆటోలో కాయగూరలను తీసుకొని ధర్మారానికి వస్తు మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుకు పూర్తిగా పక్కన నిలబెట్టుకొని ఉండగా, తాడిపత్రి నుంచి ధర్మవరం వైపు వస్తున్న లారీ ఒక్కసారిగా ఆటో వైపు దూసుకుపోవడంతో, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, లారీని స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. తదుపరి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య సునీతతో పాటు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయినా భర్త చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరుణ విల పించారు. మీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img