https://www.fapjunk.com https://pornohit.net london escort london escorts buy instagram followers buy tiktok followers
Wednesday, February 21, 2024
Wednesday, February 21, 2024

అర్హత గల వారందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు అందరూ కూడా ఓటు హక్కును తప్పనిసరిగా పొందాలని, ఓటు హక్కు మీ జన్మ హక్కు అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ ఎన్నికల అధికారులు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని బిఎల్వోలు సంబంధిత అధికారులు ఓటు ప్రక్రియ దిశలో నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగకు వచ్చు మీ కుటుంబంలోని కుమారులు, కుమార్తెలు, ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నవారు తమ తమ ఇళ్లకు వస్తారని, ఈ పండుగను దృష్టిలో ఉంచుకొని 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా తప్పనిసరిగా ఓటు హక్కును పొంది,నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటు హక్కు అనేది ఒక ఆయుధం లాంటిదని, ఓటు హక్కు సద్వినియోగంతోనే మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపే అవకాశం ఉందని తెలిపారు. ఓటు లేని వారు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలని, చేర్పులు, తొలగింపులు, బదిలీలు లాంటివి బిఎల్ఓ ల వద్ద, తాసిల్దార్ కార్యాలయం వద్ద ఫారం-7,8 లలో భర్తీ చేసి తమ ఓటు హక్కును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు. మీ ఓటు విషయములో ఏదేని తప్పులు గాని, పొరపాట్లు కానీ జరిగి ఉన్నయెడల తాసిల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. కావున ఈ ఓటు నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని, ఎన్నికల్లో తమ ఓటును వేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img