Monday, April 22, 2024
Monday, April 22, 2024

పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోండి.. ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్- జేవి. సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర సాంకేతిక శాఖ శిక్షణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కొరకు నిర్వహించే పాలిసెట్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ పాలిటెక్నిక్ కు దరఖాస్తు చేసుకునే వారు పదవ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలని లేదా మార్చి 2024 లో పదవ తరగతి పరీక్షలు రాయచున్న విద్యార్థులు అర్హులు అని తెలిపారు. దరఖాస్తు రుసుము 400 రూపాయలు ఉంటుందని, ఎస్సీ లేదా ఎస్టీ వారు అయితే నూరు రూపాయలు మాత్రమే చెల్లించి ఏదైనా ఆన్లైన్ సెంటర్లు లేదా హెల్ప్ లైన్ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పాలిసెట్ పరీక్షలు ఏప్రిల్ 27వ తేదీన ఉంటుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img