Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ


విశాలాంధ్ర -బత్తలపల్లి : మండల పరిధిలోని డీ.చెర్లోపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత బాబా డాక్టర్. అంబేద్కర్ విగ్రహం నూతనంగా ఏర్పాటు చేయడానికి భూమి పూజ చేశారు. ముక్కోటి అంబికా సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివ ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన చేత భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ శివ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక్కడ కూడా గ్రామస్తుల సహకారం ఎంతో గొప్పది అన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు త్వరగతిన పనులు పూర్తి చేసి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య అధ్యక్షుడు మద్దెలచెరువు మల్లి, హ్యాండ్ బాల్ సెక్రెటరీ శివశంకర్, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img