Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

అనాధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు..

సెట్టీపీ జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి వ్యక్తి తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో జరుపుకోవాలని సాధారణ విషయమే అవుతుంది. కానీ తన జన్మదిన వేడుకను అనాధాశ్రమంలో చేసుకొని, వారి ఆశీస్సులు పొందితే అది సేవా, దైవ మార్గంలో ఉంటుంది. ఇందులో భాగంగానే యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు, బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు, ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ సెట్టీపీ జయ చంద్రారెడ్డి తన జన్మదిన వేడుకలను మండల పరిధిలోని గొట్లురు గ్రామంలో గల అనాధాశ్రమంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ గల అనాధ ఆశ్రమంలోని వృద్ధులకు తన వంతుగా వస్త్ర దానముతో పాటు అన్నదానం చేసి మానవతా విలువలను పెంచేలా చేశారు. ఇప్పటికే జై చంద్రారెడ్డి అనేకమంది నిరుపేదల కుటుంబాలను ఆదుకుంటూ ఆర్థికంగా చేయూతను కూడా అందించడం జరిగింది. తదుపరి వందలాది మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో రాణించేలా ఎంతో కృషి చేయడం జరిగింది. నా పుట్టినరోజు వేడుకలను అనాధాశ్రమంలో జరుపుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img