Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

నీటిని సంరక్షిస్తూ, భూమిని కాపాడండి

కరెస్పాండెంట్ శెట్టిపి నిర్మల జయచంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షిస్తూ భూమిని కాపాడాలని కాకతీయ విద్యా నికేతన్ రెస్పాండెంట్ సెట్టీపీ నిర్మల జయచంద్రారెడ్డి, డైరెక్టర్ పద్మాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అంతర్జాతీయ జల దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నీరు లేనిదే జీవితం లేదని ఇప్పటికే దేశంలో ప్రముఖ నగరాల్లో నీరు దొరకకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భవిష్యత్ తరాలకు కూడా నీటిని అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎండాకాలం కావున పట్టణములో ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయరాదని, పొదుపుకు శ్రీకారం చుట్టాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సూర్య ప్రకాశ్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img