Friday, June 14, 2024
Friday, June 14, 2024

వినియోగదారుడా మేలుకో- నీ హక్కులు తెలుసుకో…

కామర్స్ విభాగపు అధ్యాపకురాలు పుష్పావతి

విశాలాంధ్ర- ధర్మవరం : ప్రతి వినియోగదారుడా మేలుకో- నీ హక్కులు తెలుసుకో,, అప్పుడే తగిన న్యాయం చేకూరుతుందని కామర్స్ విభాగం అధ్యాపకురాలు ఎం. పుష్పావతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలను విద్యార్థుల నడుమ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకురాలు చిట్టెమ్మ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో 1989 మార్చి 15 నుండి భారత ప్రభుత్వం వినియోగదారుల హక్కుల దినోత్సవం దినోత్సవంను జరపడం సాంప్రదాయంగా మారిందని వారు తెలిపారు. అంతేకాకుండా వినియోగదారులకు ఎలాంటి హక్కులు ఉంటాయి? వస్తువుల నాణ్యత, సామర్థ్యము, స్వచ్ఛత, ధర ప్రమాణాలకు సంబంధించి సమాచారాన్ని అందించి, మార్కెట్లో జరుగుతున్న అన్యాయం గురించి వినియోగదారులు తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఈ విషయమై విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు షమీవుల్ల, గోపాల్ నాయక్, కిరణ్ కుమార్,భువనేశ్వరి, స్వామి, ఆనంద్, సరస్వతి, సౌజన్య లక్ష్మి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img